వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. సీఆర్ పార్క్ సెంటర్‌లో బామ్మ ఓటేశారు. వీల్ చైయిర్‌లో వచ్చిన ఆమె.. తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఓటేసేందుకు శతాధిక వృద్ధురాలు ముందుకురావడాన్ని అధికారులు స్వాగతించారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు.

 ఆనందంలో బామ్మ

ఆనందంలో బామ్మ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పేరు వచ్చినప్పటీ నుంచి బామ్మ ఆనందానికి అవధి లేకుండాపోయింది. ఎప్పుడెప్పుడూ ఓటు వేద్దామని అనుకొన్నారు. గత కొన్నిరోజుల నుంచి ఎదురుచూస్తున్న బామ్మకు సమయం రానే వచ్చింది. శనివారం ఉదయం సీఆర్ పార్క్ సెంటర్ పోలింగ్ బూత్‌లో బామ్మ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 చేపలు ఇష్టమట..

చేపలు ఇష్టమట..

ఓటు తనకు శక్తిని ఇస్తుందని బామ్మ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. బామ్మకు దంతాలన్నీ ఊడిపోయాయి. కానీ ఆమెకు చేపలు అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఢిల్లీలోని బెంగాలీ వాడలో బామ్మ ఉంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ బామ్మ ఓటేశారు. 2020లో కూడా వజ్రాయుధాన్ని యూజ్ చేశారు.

తొలిసారి ఓటు..

తొలిసారి ఓటు..

మరోవైపు ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా, కేజ్రీవాల్ కుమారుడు పుల్‌కిత్ కేజ్రీవాల్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరు తొలిసారి ఓటు వేశారు. వీరేకాక తొలిసారి వచ్చిన యువకులు చాలా మంది ఓటువేశారు. యువకులు, పెద్దలతోపాటు వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచడం శుభపరిణామమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

English summary
111 years old women cast vote in delhi assembly poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X