వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

116 జిల్లాల్లో వలసకూలీలు: నైపుణ్యాన్ని బట్టి అక్కడే ఉపాధి, మరో 2 వారాల్లో జీవోఎం కేంద్రానికి నివేదిక

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో నగరాల్లో ఉన్న వలసకూలీలు గ్రామాల బాటపట్టారు. దీంతో అక్కడ వారికి ఉపాధి కల్పించడం కత్తిమీదసాములా మారింది. గత నెల రోజుల నుంచి వలసవచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో కమిటీ కూడా వేసింది. మరో రెండు వారాల్లో కమిటీ నివేదిక అందజేయనుంది. సొంత గ్రామలకు వచ్చిన కూలీల నైపుణ్యం ఆధారంగా పని కల్పించనున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సాయం కూడా జీవోఎం తీసుకుంటుంది.

వలసకూలీలకు ఉపాధి కల్పించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 116 జిల్లాల్లో వలసకూలీలు ఉన్నారని గుర్తించింది. ఆ జిల్లాల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో బీహర్ నుంచి 32 జిల్లాలు ఉండటం విశేషం.

116 Districts: Modi Govt Works on Mega Plan to Rehabilitate Migrant Workers..

తర్వాత 31 జిల్లాలతో యూపీ, మధ్యప్రదేశ్ 24, రాజస్థాన్ 22, ఒడిశా నుంచి 4, జార్ఖండ్ నుంచి 3 జిల్లాలు ఉన్నాయి. ఇకడున్న వారికి పునరావాసం కల్పించి, ఉపాధి అందజేస్తామని ప్రకటించారు. సోషల్ వెల్పేర్ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. పేదరికాన్ని తగ్గించేందుకు దీని కన్నా ఉత్తమమైన మార్గం లేదన్నారు.

116 జిల్లాల్లో ఉపాధి హామీ, రైతుల సంక్షేమ పథకాలు, ఆహార భద్రత పథకం, పీఎం ఆవాస్ యోజన, స్కిల్ ఇండియా స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు.ఆత్మ నిర్భార్ భారత్ అభియాన్ కింద కూలీలకు ఉఫాధి కల్పిస్తామని సంకేతాలు ఇచ్చారు. ఆయా జిల్లాల్లో కూలీల పనుల కోసం ప్రణాళికను జీవోఎం రచించింది.. దీనికి సంబంధించి రెండు వారాల్లో కేంద్రానికి నివేదిక అందజేయనుంది. రిపోర్ట్ ఆధారంగా వలసకూలీల ఉపాధి గురించి కేంద్రం నిర్ణయం తీసుకోబోతోంది.

English summary
Centre started planning for unlocking of lockdown, PM Modi swung into action. A GoM was formed last month to prepare data base of migrant labourers who returned home and their skill base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X