వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులు: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా, అమికస్ క్యురీ పిటిషన్..

|
Google Oneindia TeluguNews

ప్రజాప్రతినిధులపై కేసులు భారీగానే పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణలో 118 కేసులు ఉండగా.. ఏపీలో 106 క్రిమినల్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు బయటకు వచ్చాయి. మహిళలకు సంబంధించి నేరాలు, మర్డర్ అటెంప్ట్, కిడ్నాప్, ఎన్నికల ఉల్లంఘన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిపోర్ట్‌తో వెలుగుచూసింది.

107 కేసులు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు

107 కేసులు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు

తెలంగాణలో మొత్తం 118 క్రిమినల్ కేసులు ఉండగా.. 107 కేసులు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లతో నమోదై ఉన్నాయి. మహిళలకు సంబంధించి కేసులు అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. అలాగే ఒక ఎంపీ పేరు కూడా బయటకు వచ్చింది. దేశంలో 19 మంది ఎంపీలపై కేసులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరు ఉన్నారు. ఈ కేసులన్నీ హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయని.. నాలుగు కేసుల్లో కోర్టు స్టే కడా విధించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా, అడ్వకేట్ స్నేహ కలిటా అందజేశారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రస్తావించారు.

ఏపీలో 106 కేసులు

ఏపీలో 106 కేసులు

ఎంపీలు, ఎమ్మెల్యేల పెండింగ్ కేసులకు సంబంధించిన సమాచారం ఆగస్ట్ 31వ తేదీలోకి అమికస్ క్యూరీ నిర్దేశించిన ఫార్మాట్‌లో అందజేయాలని మార్చి నెలలో సుప్రీంకోర్టు.. హైకోర్టులను కోరింది. అయితే కొన్ని కేసులు 2012 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. విజయవాడ ప్రత్యేక కోర్టులో 106 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 85 కేసుల్లో ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు, 79 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు మాజీ ఎంపీలు, 53 మంది ఎమ్మెల్యేలు.. 53 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి కోర్టు మూడు కేసులను స్టే చేసింది. అయితే ప్రజాప్రతినిధులు ఒక్క కేసు కన్నా ఎక్కువ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.

యూపీలో అధికంగా కేసులు

యూపీలో అధికంగా కేసులు

వీటిలో చాలావరకు 188 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుండగా.. మరికొందరికీ 10 ఏళ్లు పడతాయి. కానీ కొన్ని కేసులు పదేళ్లు పెండింగ్ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా 4 వేల 442 మందిపై కేసులు ఉండగా.. వీరిలో 2556 మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నారు. యూపీలో అత్యధికంగా 1217 కేసులు ఉన్నాయి. ఇందులో 446 మంది సిట్టింగ్ నేతలు ఉన్నారు. మరోవైపు పంజాబ్‌లో 1983కి సంబంధించి పురాతన క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉంది. ఎమ్మెల్యే/ ఎంపీపై విచారణ పర్వం కొనసాగుతోందని తెలిసి.. సుప్రీంకోర్టు ధర్మాసనం షాక్‌నకు గురయ్యింది.

Recommended Video

Telangana New Revenue Act 2020 : తెలంగాణా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, రెవెన్యూ కోర్టులు రద్దు !
జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయొద్దు..?

జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయొద్దు..?


నేరారోపణలు కేసుల జాబితాను అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించింది. చట్టసభ సభ్యులపై నేరారోపణ కేసులు త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. నేరారోపణ నేతలు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయవద్దని సవరణ అప్లికేషన్ కూడా దాఖలు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలనే అంశంపై వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సమాధానం తెలిపేందుకు ఆరు వారాల గడువు ఇచ్చి.. కేసు విచారణను వాయిదా వేసింది.

English summary
107 sitting legislators in Telangana have criminal cases pending against them, they include crime against women, attempt to murder, kidnap and election related violation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X