వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:ఉపాధి కోల్పోయిన 12 కోట్ల మంది, ఒక్కో ఫ్యామిలీ రూ.7500 ఇవ్వండి: సోనియాగాంధీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల కోట్ల మంది ఉపాధి కోల్పోయారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. ఆయా సంస్థలపై ప్రభావంతో 12 కోట్ల మంది ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలకు ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్య్లూసీ) గురువారం సమావేశమైంది.

ఉపాధి కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.7500 ఆర్థికసాయం చేయాలని కోరారు. దీంతో ఆయా కుటుంబాలకు ఉపశమనం కలుగుతోందని చెప్పారు. వలసకూలీలు ఎక్కడివారు అక్కడే అచేతనంగా ఉన్నారని సోనియా గుర్తుచేశారు. ఇంటికి రాలేక, ఉన్న చోట సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి వసతితోపాటు ఆహారం అందించాలన్నారు.

12 crore jobs lost in lockdown, give Rs 7,500 to each family: Sonia Gandhi

చిన్న పరిశ్రమలు పనిచేస్తున్న 11 కోట్ల మంది ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. 11 కోట్ల మంది దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడింట ఒక వంతు ఉన్నారని సోనియా గుర్తుచేశారు. లాక్ డౌన్ వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పంట సేకరణ కోసం అవలంభించే విధానాలతో అన్నదాతకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వర్షాకాలం పంట సమయానికికైనా వారికి సరైన వసతులు సమకూర్చాలని కోరారు. మరోవైపు కరోనా వైరస్ పరీక్షలు నెమ్మదిగా చేస్తున్నారని సోనియాగాంధీ మండిపడ్డారు.

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown

English summary
Congress interim chief Sonia Gandhi on Thursday demanded the Modi government to provide monetray help to each family to tide over the job crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X