వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ లో ఐఈడీ బాంబు పేలుడు .. 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. పేలుడు దాడికి 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నెలకొరిగారు.

ఉగ్రవాదుల ఘాతుకం ..

జవాన్ల బస్సు అవంతిపురా చేరుకోగానే బాంబును పేల్చారు ఉగ్రవాదులు. దీంతో బస్సు తునాతునకలైంది. ఆ తర్వాత ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 20 మంది జవాన్లు చనిపోయారు. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరో 45 మంది జవాన్లకు గాయాలైనట్టు తెలుస్తోంది. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ పేలుడులో అక్కడున్న స్థానికులకు కూడా గాయాలైనట్టు అధికారులు తెలిపారు. బాంబు పేల్చింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కాన్వాయ్ లో 70 వాహనాలు ..

జమ్ము నుంచి శ్రీనగర్ కు జవాన్ల కాన్వాయ్ వస్తోందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ కాన్వాయ్ లో 70 వాహనాలు ఉన్నాయని ... మొదటి బస్సు పేలుడు గురవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. వాహన క్రమంలో ఉన్న రెండు బస్సులనే ఉగ్రవాదులు టార్గెట్ చేశారని చెప్పారు. ఐఈడీ బాంబు పేలుడు ధాటికి బస్సు ఎగిరి తునతూనకలైందని అక్కడున్న ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో అక్కడున్న స్థానికలుు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో ఉగ్రవాది

పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. పుల్వామాలోని కాకపోరకు చెందిన ఆదిల్ అహ్మద్ పేలుళ్లకు పాల్పడ్డారని చెప్పారు. 2018లో ఆదిల్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడని తెలిపారు.

దాడితో హైలర్ట్

దాడితో హైలర్ట్

పుల్వామాలో ఉగ్రవాదుల దాడితో కశ్మీర్ లో హై అలర్ట్ నెలకొంది. ఈ దాడిలో ఎక్కువమంది జవాన్లు చనిపోవడంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. సరిహద్దు, రహదారుల వెంట బలగాలను మొహరించారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, కేంద్ర అదనపు బలగాలు కశ్మీర్ చేరుకుని .. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

జవాన్లపై దాడి హేయనీయం : ఒమర్ అబ్దుల్లా

ఉగ్రవాదుల బాంబు పేలుడును మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. పేలుడులో గాయపడ్డ జవాన్లు కోలుకోవాలని ఆకాంక్షించారు. వీర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

English summary
At least 12 Central Reserve Police Force (CRPF) personnel were killed and over 40 injured after terrorists targeted a convoy with a powerful explosive at Awantipora in Jammu and Kashmir's Pulwama district today, reports said. Terrorist group Jaish-e-Mohammed has claimed responsibility for the attack. Fifteen of the injured are said to be in a critical condition. The nature of the device used to cause the explosion, which occurred in Goripora area, is yet to be ascertained. The injured have been moved to the army base hospital in Srinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X