వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు ప్రత్యక్షం.. కొండచరియ నుంచి రావడంతో..

|
Google Oneindia TeluguNews

మిజోరాం-త్రిపుర సరిహద్దులో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో చోట ఎముకలు, ఆభరణాలు లభించాయి. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అక్కడ రహదారి నిర్మాణంలో ఉంది అని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్రోజామా తెలిపారు.

 12 human skulls, bones, ornaments found in landslide debris

ఉదయం కొండచరియ విరిగిపడిందని.. దాని తీసి వేసే సమయంలో అందులో 12 పుర్రెలు, ఎముకలు, చెవిపోగులు, స్మోకింగ్ పైప్, లభించాయి. అయితే ఇవీ మానవులేనని కచ్చితంగా చెప్పలేమని డీసీ తెలిపారు. దీనిపై శాస్త్రీయ పరిశీలన చేయాల్సి ఉందని చెప్పారు. వీటిని శనివారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగిస్తామని.. వారు పరిశోధించి నిజ నిజాలు తెలియజేస్తారని తెలిపారు. తర్వాత ఘటనాస్థలానికి పోలీసులు కూడా వచ్చి పరిశీలించారు.

గతేడాది కూడా మట్టికుండలో అస్తిపంజర అవశేషాలు కనిపించాయి. కొన్నినెలల క్రితం త్రిపురలో గల జంపూయి కొండలలో, గతేడాది ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కూడా అలాంటి అవశేషాలు కనిపించాయని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ సుజీత్ నయన్ తెలిపారు

English summary
Locals at a road construction site near the Mizoram-Tripura border were in for a surprise when debris from a landslide threw up remains of human skulls, bones, ornaments and pottery shards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X