భారీ వర్షాలు: 12 మంది అమాయకులు బలి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది దుర్మరణం చెందారు. పలు చోట్ల ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. సహాయక చర్యలు చేపట్టడంలో అధికరులు నిర్లక్షం చేశారు. తగ్గు ప్రదేశాలు, మురికివాడల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిర్లక్షం చేశారు. కనీసం పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు.

కాన్పూర్ బిల్హర్ ప్రాంతంలో ఇద్దరు, మావు జిల్లాలో ఒకరు, వారణాసిలోని శివపుర ప్రాంతంలో ఒకరు, రామ్ గావ్ లో ఇల్లు కూలి ఒకరు మరణించారు. అజాంఘడ్ లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కుప్పకూలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు.
ఫరుఖాబాద్ లో నలుగురు, మధురాలో ఒకరు మరణించారు., వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికి కళ్లు తెరిచిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications