• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెట్రల్ విస్టా రద్దు,ఆ డబ్బుతో ఆక్సిజన్, ఉచిత వ్యాక్సిన్లు-మోదీకి 12 ప్రతిపక్షాల లేఖ-కేసీఆర్,జగన్,చంద్రబాబు నో

|

దేశంలో కరోనా రెండో దశ విలయం ఉధృతంగా సాగుతున్నది. అధికారికంగా ప్రతిరోజూ 4వేలకు తగ్గకుండా మరణాలు నమోదవుతుండగా, నదుల్లో కొట్టుకొస్తున్న శవాలకు లెక్కేలేదు. రోజువారీ కేసులు నాలుగు లక్షలకు చేరువగా ఉన్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ గందరగోళంగా తయారైంది. 18 నుంచి 44ఏళ్ల వారికి టీకాల బాధ్యత రాష్ట్రాలదేనన్న కేంద్రం ఆమేరకు సరఫరాలు చేయకపోగా, సొంత కొనుగోళ్లకు నో చెబుతున్నది. కొవిడ్ కాటుకు జనం పిట్టల్లా రాలిపోతున్నా మోదీ సర్కారు మాత్రం ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును యథావిథిగా కొనసాగిస్తుండటం విమర్శలకు తావిచ్చినట్లయింది. ఈ వ్యవహారాలన్నిటిపై 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బుధవారం ఉమ్మడిగా ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాశారు..

పోలియో వ్యాక్సిన్ ప్లాంటులో కొవాగ్జిన్ ఉత్పత్తి -బిబ్కాల్ టార్గెట్ నెలకు 2కోట్ల డోసులు -అదే గందరగోళంపోలియో వ్యాక్సిన్ ప్లాంటులో కొవాగ్జిన్ ఉత్పత్తి -బిబ్కాల్ టార్గెట్ నెలకు 2కోట్ల డోసులు -అదే గందరగోళం

బడ్జెట్ కేటాయింపులేవీ?

బడ్జెట్ కేటాయింపులేవీ?


కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రతిపక్ష పార్టీలు తొమ్మిది కీలక డిమాండ్లు చేశాయి. వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని, ఇందు కోసం గ్లోబల్, డొమెస్టిక్ సోర్సుల నుంచి టీకాలను పెద్ద ఎత్తున సేకరించే పనికి కేంద్రం వెంటనే పూనుకోవాలి. ఉచితంగా మాస్ వ్యాక్సినేషన్ చేపట్టాలి. వ్యాక్సిన్ తయారీ దారులైన కంపెనీలకు తప్పనిసరి లైసెన్సులను కొంతకాలంపాటు సడలించాలి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్ లో కేటాయించిన రూ.35,000కోట్లను ఖర్చుచేయాలి. అలాగే,

సుప్రీంకోర్టు సినియర్ జడ్జికి కరోనా -కీలక సమయంలో వైరస్, వ్యాక్సిన్ సంబంధిత విచారణలు వాయిదా..సుప్రీంకోర్టు సినియర్ జడ్జికి కరోనా -కీలక సమయంలో వైరస్, వ్యాక్సిన్ సంబంధిత విచారణలు వాయిదా..

సెంట్రల్ విస్టా రద్దు చేసి..

సెంట్రల్ విస్టా రద్దు చేసి..

కరోనా విలయకాలంలోనూ ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కొనసాగించొద్దని, దానిని పూర్గిగా రద్దు చేసి ఆ డబ్బుతో దేశానికి సరిపడా ఆక్సిజన్, వ్యాక్సిన్లకు ఖర్చు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన పీఎం కేర్స్ సహా అన్ని ప్రైవేటు ట్రస్టుల డబ్బులను వెలికితీసి కొవిడ్ కోసం వాడాలి. నిరుద్యోగులకు నెలనెలా రూ.6వేలు భృతి ఇవ్వాలి. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలి. ఆందోళన చేస్తోన్న రైతులు కొవిడ్ బారినపడకుండా మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీని డిమాండ్ చేశాయి..

మోదీకి వినే అలవాటు లేకున్నా..

మోదీకి వినే అలవాటు లేకున్నా..


ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆయన తీరుతోపాటు కేంద్ర సర్కారు విధానాలపై ప్రతిపక్ష నేతలు సునిశిత విమర్శలు చేశారు. ఎదుటివారు చెప్పే ఎలాంటి విషయాన్నైనా వినే అలవాటు ప్రధాని మోదీకి, కేంద్రానికి లేదని, అయినాసరే దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మరోసారి లేఖ రాయకతప్పడంలేదని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. కరోనా అతితీవ్రమైన మానవ విషాదమని, కనీసం ఈ సమయంలోనైనా ప్రధాని మోదీ నిపుణులు, విపక్షాల సూచనలను స్వీకరించాలని సూచించారు. అందులో..

కొత్త సీఎంలతోపాటు 12మంది..

కొత్త సీఎంలతోపాటు 12మంది..


కొవిడ్ పరిస్థితులపై కేంద్రం తీరు మారలంటూ, 9 డిమాండ్లతో కూడిన లేఖపై మొత్తం 12 మంది విపక్ష నేతలు సంతకాలు చేశారు. వారిలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులు కూడా ఉండటం గమనార్హం. ప్రధానికి రాసిన లేఖపై సోనియా గాంధీ(కాంగ్రెస్), దేవేగౌడ్(జేడీఎస్), శరద్ పవార్(ఎన్సీపీ), ఉద్ధవ్ ఠాక్రే(శివసేన), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), ఫారూఖ్ అబ్దుల్లా(జేకేపీఏ), అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ) సంతకాలు చేశారు. అయితే..

  Cricketer RP Singh కి పితృ వియోగం, Piyush Chawla కి కూడా!! || Oneindia Telugu
  కేసీఆర్, జగన్, చంద్రబాబు వేరేదారి..

  కేసీఆర్, జగన్, చంద్రబాబు వేరేదారి..

  దేశంలో కరోనా పరిస్థితుల నిర్వహణలో కేంద్రం, ప్రధాని మోదీ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోంటే తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం భిన్నమార్గంలో పయనిస్తున్నారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ బాహాటంగా బీజేపీ సర్కారుకు మద్దతు పలకాలని, మోదీని సమర్థించాలని పిలుపునివ్వగా, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తన సలహాలను మోదీ స్వీకరించారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును అటు బీజేపీతోపాటు ఇటు ప్రతిపక్షాలు గుర్తించకపోవడం, ఇవాళ్టి లేఖలో బాబుకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.

  English summary
  Leaders of 12 opposition parties Wednesday wrote to Prime Minister Narendra Modi seeking a free mass vaccination campaign against coronavirus, and suspending the central vista revamp project and utilise that money in fighting the pandemic. In a joint letter to the prime minister, the opposition leaders, including some chief ministers, have also demanded providing foodgrains to the needy, and giving Rs 6,000 per month to the unemployed. They leaders have also demanded a repeal of the three Central farm laws which, they said, will help protect lakhs of ‘annadatas’ from becoming the victims of pandemic
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X