వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు: బాలుడి భుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో 12ఏళ్ల బాలుడి భుజంలోకి బుల్లెట్ దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఈ కాల్పుల ఘటన ఒంటి గంట ప్రాంతంలో చోటు చేసుకుంది.

నలుగురు వ్యక్తులు ఢిల్లీలోని గీతా కాలనీలోకి అడుగుపెట్టి ఓ ఇంటిపై కాల్పులకు దిగారు. ఓ ముక్తియార్‌ను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన జరుగుతున్న సమయంలో ఇంటి తలుపులు తీసుకుని బయటకు వచ్చిన ముక్తియార్ సోదరుడైన 12 ఏళ్ల బాలుడి భుజంలోకి బుల్లెట్ దూసుకుపోయింది.

 12-year-old injured in firing in Delhi's Geeta Colony

ఈ కాల్పలు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని ఢిల్లీలోని జీబీటీ ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనపై పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ రాత్రి ఒంటి గంటా లేదా 1.15 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 15 నుంచి 20 నిమిషాటు మా పక్కింటిపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

ఈ కాల్పుల ఘటనలో నిందితులు టార్గెట్ చేసిన వ్యక్తి తప్పించుకోగా, అతడి సోదరుడికి తీవ్ర గాయాలపాలయ్యాడని తెలిపారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ కాల్పుల ఘటనపై విచారణ చేపట్టారు.

English summary
A 12-year-old boy was grievously injured in an incident of firing in Delhi's Geeta Colony area during the wee hours of Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X