వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరియాణాలో 12 ఏళ్ల రిపోర్టర్ జోస్యం నిజమైంది, లక్ష మంది ఫాలోవర్స్, పిట్ట కొంచెం కూత !

|
Google Oneindia TeluguNews

జింద్ (హరియాణా): హరియాణాలో ఎన్నికల ఫలితాలు వెడిక్కిపోయిన సమయంలో ఆ రాష్ట్రంలో 12 ఏళ్ల పాత్రికేయుడు (రిపోర్టర్) తీవ్చ చర్చకు తెరలేపాడు. హరియాణాలో ఇంత కాలం అధికారంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు చూస్తూ వచ్చిన గుర్మిత్ గోయట్ అలియాస్ గోల్డి (12) గురువారం ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడుతున్న సమయంలో చర్చకు దారి తీశారు. 12 ఏళ్ల వయసులో 100 మందికి పైగా అనేక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులను ఇంటర్వూ చేసిన గుర్మిత్ గోయట్ హరియాణాలో హాట్ టాపిక్ అయ్యారు.

హరియాణలో హంగ్ అసెంబ్లీ ? సీఎం పదవి ఇస్తారా, చస్తారా ?, జేజేపీ, అమిత్ షా బి ప్లాన్!హరియాణలో హంగ్ అసెంబ్లీ ? సీఎం పదవి ఇస్తారా, చస్తారా ?, జేజేపీ, అమిత్ షా బి ప్లాన్!

తాత ఆశపడ్డారు

తాత ఆశపడ్డారు

హరియాణాలోని జింద్ ప్రాంతంలో గౌయత్ నివాసం ఉండేవారు. .గోయట్ మనుమడు గుర్మిత్ గోయట్ అలియాస్ గిల్డి. తన మనుమడు గుర్మిత్ గోయట్ పాత్రికేయుడు కావాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని గోయట్ ఆశ పడ్డారు. అయితే ప్రస్తుతం గోయట్ మరణించారని గుర్మిత్ గోయట్ విచారం వ్యక్తం చేస్తున్నాడు.

గుర్మిత్ వీడియో చానల్

గుర్మిత్ వీడియో చానల్

గుర్మిత్ గోయట్ హర్ష్ ఇంటర్మేషన్ స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తాత ఆశ మేరకు గుర్మిత్ గోయట్ యూట్యూబ్ లో ఓ వీడియో చానల్ పెట్టాడు. హరియాణాలోని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చారు. హరియాణాలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్మిత్ గోయట్ తన యూట్యూబ్ వీడియో చానల్ లో అభిప్రయాలు వ్యక్తం చేశాడు.

కేజ్రీవాల్, దుశ్యంత్ చౌటాలా ఇంటర్వూలు

కేజ్రీవాల్, దుశ్యంత్ చౌటాలా ఇంటర్వూలు

అతి చిన్న వయసులో గుర్మిత్ గోయట్ ఇప్పటి వరకూ 100 మందికి పైగా ప్రముఖులను ఇంటర్వూ చేశారు. గుర్మిత్ గోయట్ తన ఇంటర్వూలో అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూ రాటు తేలిన రాజకీయా నాయకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా తదితరుల ఇంటర్వూలు చేసిన గుర్మిత్ గోయట్ అందరి నోట ఔరా అనిపించుకున్నాడు.

2034లో రాజకీయాల్లోకి

2034లో రాజకీయాల్లోకి

2034 వరకు తాను పాత్రికేయుడిగానే ఉంటానని గుర్మిత్ గోయట్ అంటున్నాడు. ప్రస్తుతం హరియాణాలో ప్రజలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్మిత్ గోయట్ అంటున్నాడు. 2034 తరువాత తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏ రాజకీయ పార్టీలో తాను చేరనని, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని గుర్మిత్ గోయట్ చెప్పాడు.

లక్ష మంది ఫాలోవర్స్

లక్ష మంది ఫాలోవర్స్

గుర్మిత్ గోయట్ యూట్యూబ్ వీడియో చానల్ లో లక్ష మందికి పైగా ఫోలోవర్స్ ఉన్నారు. దేశంలోని ప్రముఖులు అందరినీ తాను ఇంటర్వూ చెయ్యాలని ఉందని గుర్మిత్ గోయట్ అంటున్నారు. హరియాణాలో అధికార పార్టీ తీరుతో ప్రజలు విసిగిపోయారని ఇంత కాలం అభిప్రాయం వ్యక్తం చేసిన గుర్మిత్ గోయట్ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత ఏం చెబుతాడో అని చాల మంది ఎదురు చూస్తున్నారు.

English summary
12 Years Old Journalist Gurmeet Goyat form Haryana story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X