వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో మరో చిన్నారిపై రేప్: వాట్సాప్ ద్వారా తల్లికి ఆ వీడియో..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, కథువా, సూరత్.. ఇలా వరుస రేప్ సంఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో మరో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ 12ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రేప్ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతూ.. చిన్నారి తల్లిదండ్రులకు చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కథువా రేప్: మహిళలంటే అంత చులకనా?, ఆ లాయర్ అభ్యంతరకర కామెంట్స్కథువా రేప్: మహిళలంటే అంత చులకనా?, ఆ లాయర్ అభ్యంతరకర కామెంట్స్

 అత్యాచారం చేసింది బంటీ..

అత్యాచారం చేసింది బంటీ..

బంటీ అనే పక్కింటి కుర్రాడు.. బాలికను ఆకర్షించి తనతో పాటు స్థానిక కమ్యూనిటీ సెంటర్ వద్దకు తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. అక్కడే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో మరో ఇద్దరు స్నేహితులు కూడా అతనికి సహకరించినట్టు తెలుస్తోంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

రేప్ తర్వాత బెదిరించారు..

రేప్ తర్వాత బెదిరించారు..

బంటీ అనే యువకుడు చిన్నారిపై అత్యాచారం చేస్తుంటే.. మిగతా ఇద్దరు స్నేహితులు ఆ ఘటనను సెల్ ఫోన్ ద్వారా వీడియో షూట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ చిన్నారిని బెదిరించారు. దీంతో బాధిత బాలిక విషయాన్ని ఇంట్లోనూ ఎవరితో చెప్పలేదు.

 ఇలా వెలుగులోకి

ఇలా వెలుగులోకి

ఇటీవల ఓ వైరల్ వీడియో బాధిత బాలిక తల్లికి వాట్సాప్ ద్వారా వచ్చింది. అదేంటా అని చూస్తే.. అందులో తన కూతురి పైనే అత్యాచారం జరుగుతుండటం చూసి షాక్ తిన్నది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోస్కో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ నిందితుడు బన్నీ కుటుంబం నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని, కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలి తల్లి వాపోయారు.

మమ్మల్ని బెదిరిస్తున్నారు: బాధితురాలి తల్లి

మమ్మల్ని బెదిరిస్తున్నారు: బాధితురాలి తల్లి

'బంటీ ఓ బడా కుటుంబానికి చెందినవాడు. మా ఏరియాలో అతని కుటుంబ సభ్యులు చాలా పవర్ ఫుల్. బన్నీ అరెస్టయిన తర్వాత.. కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా వారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు, ఈ ఏరియా విడిచిపెట్టి పోవాలని బెదిరిస్తున్నారు' అని బాధితురాలి తల్లి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
In yet another horrifying incident of crime against women, a 12-year-old mentally challenged girl was allegedly raped by her neighbour in outer Delhi’s Rohini area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X