వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావిలో పడిన 2 ఏనుగుల కోసం120 ఏనుగులొచ్చాయి!

By Narsimha
|
Google Oneindia TeluguNews

మిడ్నపూర్ :ఓ మనిషి రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే చూస్తూ మన దారిన మనం పోతుంటాం. కాని, నోరు లేని మూగ జీవాల...తమతో ఉన్న 2 జంతువులు ప్రమాదానికి గురయ్యాయని తెలిసి వాటికి రక్షణ కల్పించేందుకు వచ్చాయి.వింత గొలిపే ఈ ఘటన పశ్చిమబంగా రాష్ట్రంలో చోటుచేసుకొంది.

పశ్చిమబంగా రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో అడవిలో నుండి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి.వాటిని రక్షించేందుకుగాను 120 ఏనుగులు బావివద్దకు వచ్చి రక్షణ కల్పిస్తున్నాయి.ఈ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8 గంటలకు రెండు ఏనుగులు ప్రమాదశాత్తు బావిలో పడిపోయాయి.ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన ఏనుగులు అడవి నుండి బావి వద్దకు చేరుకొన్నాయి.బావి వద్ద రక్షణ వలయాన్ని ఏర్పరచాయి.

120 elephants come to protect 2 elephants

అడవి నుండి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు ప్రసవించింది.ఇది కూడ ఏనుగుల గుంపు అక్కడే ఉండేందుకు కారణమైంది. బావిలో పడిన ఏనుగులను వెలికితీసేందుకు అటవీశాకాధికారులకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసే అవకాశం ుందని అధికారులు గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు.దరిమిలా వారు సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.ఈ ఏనుగుల గుంపును అడవి ప్రాంతానికి తరిమివేస్తేనే బావిలో పడిన ఏనుగులను సురక్షితంగా తీసే అవకాశం ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.

English summary
two elephants slip in to a well at lalka village westmidnapur districtin west bangla state.120 elephants came from forest to protect two elephants.in that time one elephat delivered a baby elephant.how to handle this situation did not khow said forest officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X