వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీల మూకుమ్మ‌డి రాజీనామా..!? మోదీకి వ్య‌తిరేకంగా ఐక్య‌త చాటేందుకు : అర్ద‌రాత్రి సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ సమావేశాల చివ‌రి రోజున సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. మోదీకి వ్య‌తిరే కం గా ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు యోచిస్తున్నారు. దీని పై ముఖ్య నేత‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు కీల‌క మంత నాలు జ‌రిపారు. గ‌తంలో భోఫోర్స్ కుంభ‌కోణం స‌మ‌యంలో చేసిన విధంగానే..ఇప్పుడ రాఫెల్ వ్య‌వ‌హారంలో అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని రాజ్య‌సభ‌లో త‌లాక్ బిల్లును ప్ర‌వేశ పెడుతున్నారు.

మూకుమ్మ‌డి రాజీనామాలు..
రాఫెల్‌ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి మోదీ సర్కార్‌ నిరాకరించడం, ఆంధ్ర ప్రదే శ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. లోక్‌సభకు చివరి రోజు అయినా.. మోదీ సర్కారు తీరుపై ఆఖరి పోరాటంగా.. ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యాయన డానికి సంకేతంగా రాజీనామా చేయాలని యోచిస్తున్నారు.

120 Opposition MPS Resign..!?..Twist to Modi on Last Day

ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీ ఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జ‌రిపారు. ఇదే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగాయి. బుధవారం ఉదయానికి గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని స‌మాచారం.

చివ‌రి రోజు చేస్తే ఫ‌లితం ఉంటుందా..
ఈ లోక్‌సభకు చివరి సమావేశాల్లో చివరి రోజు రాజీనామాలు చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుద‌నే అంశంపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కాగా, బోఫోర్స్‌ విషయంలో, ఎన్టీఆర్‌ హయాంలో అప్పట్లో 106 మంది ఎంపీలు రాజీనామా చేసారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దాదాపు 10 పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధపడవ చ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బోఫోర్స్‌ స్కాంలో ఆరోపణల నేపథ్యంలో రాజీనామాకు అప్పటి ప్రధా ని రాజీవ్‌ గాంధీ నిరాకరించారు.

జేపీసీకీ తిరస్కరించారు. ఎన్టీ రామారావు నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ఊహించని నిరసనకు దిగింది. ఏకంగా 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో, లోక్‌సభ సంక్షోభంలో పడింది. ఇప్పుడు బిజెపి ప్ర‌భుత్వం సంక్షోభం లో ప‌డే అవ‌కాశం లేకపోయినా..నిర‌స‌న‌..త‌మ ఐక్య‌త చాట డానికి మందుకు వెళ్లాల‌ని వారు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

English summary
Opposition Mp's in Loksabha may resign collectively against Modi attitude. AP CM Chandra Babu, Rahul Gandhi, Sarad pawar discussed about this proposal up to late night. but final decision not taken. Before starting of last day loksabha procee dings they may take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X