వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్‌లో సహా 13 దేశాలకు 64 విమానాలు: స్పెషల్ ఆపరేషన్: వారంలో స్వదేశానికి: ఫస్ట్ ఫ్లయిట్ 7న.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ సహా 13 దేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రాలేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. గురువారం నుంచి అంటే ఈ నెల 7వ తేదీ నుంచి దీనికి సంబంధించిన పనులు ఆరంభం కాబోతున్నాయి. గల్ఫ్ సహా మొత్తం 13 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనుంది. తొలిదశలో 14000 మందిని స్వదేశానికి తరలించనుంది.

Recommended Video

Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu

ఎయిర్ లిఫ్ట్: గల్ఫ్‌లో నరకాన్ని చవి చూస్తోన్న భారత కార్మికులకు కేంద్రం శుభవార్త: 10 లక్షల మంది..!ఎయిర్ లిఫ్ట్: గల్ఫ్‌లో నరకాన్ని చవి చూస్తోన్న భారత కార్మికులకు కేంద్రం శుభవార్త: 10 లక్షల మంది..!

13 దేశాలకు 64 విమానాలు..

13 దేశాలకు 64 విమానాలు..

ఫిలిప్పీన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, ఖతర్, అమెరికా, ఒమన్, బహ్రెయిన్, కువైట్‌లల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన నాలుగు రోజుల కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఓ సమగ్ర షెడ్యూల్‌ను రూపొందించారు. దీన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందజేశారు. ఈ నెల 7వ తేదీన మొత్తం 10 విమానాలు టేకాఫ్ తీసుకోబోతున్నాయి.

తొలిరోజు 2300 మందిని

తొలిరోజు 2300 మందిని

ఆయా దేశాల్లో చిక్కుకున్న వారిలో 2300 మందిని స్వదేశానికి తీసుకుని వస్తారు. అబుధాబి-కోచి, దుబాయ్-కోచి, దోహా-కోచి, లండన్-ముంబై, సింగపూర్-ముంబై, కౌలాలంపూర్-ఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో-ముంబై-హైదరాబాద్, మనీలా-అహ్మదాబాద్, ఢాకా-శ్రీనగర్‌ మధ్య ఈ ప్రత్యేక విమానాలను నడిపించనున్నారు. ఒక్కో విమానంలో 200 నుంచి 250 మందిని స్వదేశానికి తీసుకుని వస్తారు. ఆయా నగరాలతో పాటు మరిన్ని చోట్ల భారతీయులు చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకొస్తారు. ఇలా తొలివిడతలో 14000 మందిని స్వదేశానికి తీసుకుని రావడానికి అవసరమైన ఏర్పాట్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది.

 రాష్ట్రాల నుంచి నివేదికలు..

రాష్ట్రాల నుంచి నివేదికలు..


రాష్ట్రాల నుంచి కూడా జాబితాను తెప్పించుకునే పనిని ఇప్పటికే పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏఏ రాష్ట్రం నుంచి ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారనే విషయంపై పూర్తి సమాచారంతో కూడిన నివేదికను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి అందజేశాయి. దీని ఆధారంగా కేంద్రం విడతల వారీగా భారతీయులను స్వస్థలాలకు చేర్చబోతోంది. వారంరోజుల్లో తొలివిడత పూర్తి చేసిన తరువాత.. మిగిలిన వారిని రప్పించడానికి రెండో విడతకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిను ఆరంభిస్తుంది. ఒకేసారి వేలాదిమంది తీసుకుని రావడం వల్ల క్వారంటైన్ ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే దశలవారీ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

కేంద్రం విడుదల చేసిన జాబితా వివరాలు

కేంద్రం విడుదల చేసిన జాబితా వివరాలు

ఇక కేంద్రం విడుదల చేసిన జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. యూఏఈలో అబుదాబి, దుబాయ్ షార్జాలలో విమానాలు ప్రారంభమై కొచ్చి, కోజికోడ్, చెన్నై లక్నో, హైదరాబాదు, ఢిల్లీ, అమృత్‌సర్ నగరాలకు 2వేల మంది ప్రయాణికులను చేరుస్తుంది. ఇక సౌదీ అరేబియా దేశంలో రియాద్, దమామ్, జెడ్డాల నుంచి కోజికోడ్, ఢిల్లీ, కొచ్చిలకు 1000 మంది ప్రయాణికులను విమానాలు చేరవేస్తాయి. ఖతార్‌ దేశంలో దోహా నుంచి బయలు దేరే విమానాలు కొచ్చి, తిరువనంతపురంలకు 400 మంది ప్రయాణికులను చేరవేస్తాయి. అదే సమయంలో బహ్రెయిన్ దేశంలో మనామా నుంచి బయలు దేరే విమానాలు కొచ్చి, కోజికోడ్‌లకు 400 మంది ప్రయాణికులను చేరుస్తారు. ఇక యూకేలో లండన్‌ నగరం నుంచి బయలు దేరే విమానాలు ముంబై, బెంగళూరు, హైదరాబాదు, అహ్మదాబాదు, చెన్నై ఢిల్లీ నగరాలకు 1750 మంది ప్రయాణికులను చేరవేస్తాయి విమానాలు. ఇక అమెరికా దేశం నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో, వాషింగ్టన్‌ల నుంచి విమానాలు బయలుదేరి ముంబై, హైదరాబాదు, అహ్మదాబాదు, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు 2100 మంది ప్యాసింజర్లను చేరవేస్తాయి. ఇక ఏఏ దేశం నుంచి భారత్‌లోని ఏఏ నగరాలకు ప్రయాణికులను చేరవేస్తాయో పూర్తి జాబితా ఇదే.

సముద్రమార్గం గుండా..

సముద్రమార్గం గుండా..

భారత కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల నౌకాదళ సహాయాన్ని కూడా తీసుకోనుంది. గల్ఫ్ దేశాల్లో తీర ప్రాంత నగరాల్లో నివసించే భారత కార్మికులను సముద్రమార్గం గుండా తీసుకుని రావడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను సూచించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఇంకా అందాల్సి ఉందని తెలుస్తోంది. విదేశాంగ శాఖ నుంచి రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ సమాచారం అందిన తరువాతే.. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందిస్తారని అంటున్నారు.

English summary
The Ministry of External Affairs (MEA) has prepared a chart for the evacuation of over 14,000 Indian nationals stranded in 13 foreign countries by 64 flights in week 1 of the operation. According to the MEA plan shared with the Ministry of Civil Aviation (MoCA) that is set to begin from May 7, an approximate 14,800 passengers will be evacuated from 13 different countries. Flights from India will fly to the Philippines, Singapore, Bangladesh, UAE, UK, Saudi Arabia, Qatar, Singapore, Phillippines, USA, Oman, Bahrain and Kuwait. The first day of evacuation will see 10 flights repatriate 2300 Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X