వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు: 2 సిట్‌‌ల ఏర్పాటు, ఆప్ కౌన్సిలర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

సీఏఏ అనుకూల, ప్రతికూల నిరసనలతో రగిల్చిన చిచ్చు ఈశాన్య ఢిల్లీని దహించి వేస్తోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 28 మంది చనిపోయారు. గాయపడ్డవారి సంఖ్య 200కి పైగా చేరింది. మౌజాబాద్ చౌక్, జాఫ్రాబాద్‌లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. సిచుయేషన్ క్రమంగా అదుపులోకి వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. మంగళవారం 13 మంది చనిపోగా.. బుధవారం ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి వరకు 27 మంది చనిపోగా.. గురువారం ఉదయం మరొకరు చనిపోయారని జీటీబీ వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఆ సంఖ్య 34కి చేరింది.

delhi clashes: సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన, వాటర్ క్యానన్ల ప్రయోగంdelhi clashes: సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన, వాటర్ క్యానన్ల ప్రయోగం

13 killed, curfew imposed, Amit Shah cancels Trivandrum visit live updates

ఢిల్లీ హింసలో జర్నలిస్టు దారుణ హత్య.. గంటగంటకూ పెరుగుతోన్న మరణాలు..ఢిల్లీ హింసలో జర్నలిస్టు దారుణ హత్య.. గంటగంటకూ పెరుగుతోన్న మరణాలు..

Newest First Oldest First
9:16 PM, 27 Feb

ఐబీ అధికారి అంకిత్ శర్మ మరణానికి బాధ్యులంటూ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్యానేరం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
9:14 PM, 27 Feb

ఢిల్లీలో అల్లర్లకు కారణమైందనే ఆరోపణలతో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు చెందిన ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు.
9:13 PM, 27 Feb

ఢిల్లీ అల్లర్లలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేశారు.
8:14 PM, 27 Feb

ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 38కు చేరింది. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మరణించడంతో ఈ సంఖ్య పెరుగుతోంది.
7:28 PM, 27 Feb

తూర్పు, ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతలపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
6:49 PM, 27 Feb

ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది. అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులు కూడా సిట్‌కు బదిలీ చేయనున్నారు.
6:22 PM, 27 Feb

నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు. నిరసనకారులను రోడ్డును అడ్డుకోకుండా చూడాలని మాత్రమే పోలీసులను కోరాను. ఇక కొన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉన్నందునా నేనేమీ మాట్లాడను: కపిల్ మిశ్రా
4:49 PM, 27 Feb

ఢిల్లీ అల్లర్లలో గాయపడిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
4:45 PM, 27 Feb

అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్

దేశ భద్రతపై రాజీ పడకూడదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యక్తి అయితే రెట్టింపు శిక్ష ఉండాలి: అరవింద్ కేజ్రీవాల్
4:05 PM, 27 Feb

శాంతి మంత్రం

ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలతో అడిషనల్ కమిషనర్ సమావేశం
4:04 PM, 27 Feb

మాటా మంతీ

స్థానికులతో స్పెషల్ సీపీ శ్రీవాత్సవ కబుర్లు
3:52 PM, 27 Feb

క్షేత్రస్థాయిలో..

ఖాజూరి కాస్ ప్రాంతంలో పర్యటిస్తోన్న డిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) శ్రీ వాత్సవ
3:47 PM, 27 Feb

అల్లర్ల నేపథ్యంలో

ఈశాన్య ఢిల్లీలో 10,12వ తరగతికి సంబంధించి నెల 28, 29వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటనలో తెలిపింది.
3:07 PM, 27 Feb

విచారణ వాయిదా

అల్లర్లపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు, కేసు విచారణ ఏప్రిల్ 13వ తేదీకి విచారణ వాయిదా
3:04 PM, 27 Feb

106 మంది అరెస్ట్

అల్లర్లకు పాల్పడిన 106 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ద్వారా మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపిన పోలీసులు
3:03 PM, 27 Feb

కోలుకుంటున్నాడు..

అల్లర్లలో గాయపడ్డ జర్నలిస్ట్ ఆకాశ్ పరిస్థితి మెరుగవుతోందన్న జీటీబీ వైద్యులు
2:38 PM, 27 Feb

ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. లేదా

అల్లర్లకు కారణమైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు, 48 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన పోలీసులు
2:37 PM, 27 Feb

వాదనలు స్టార్ట్

అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ప్రారంభం
2:13 PM, 27 Feb

సిచుయేషన్ అండర్ కంట్రోల్

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
1:47 PM, 27 Feb

ఉన్నతస్థాయి సమీక్ష

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
1:46 PM, 27 Feb

చర్యలు తీసుకోండి

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
https://telugu.oneindia.com/news/india/13-killed-curfew-imposed-amit-shah-cancels-trivandrum-visit-live-updates-264011.html
12:34 PM, 27 Feb

ప్రజలతో మమేకం

ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త నేపథ్యంలో ప్రజలమే మమేకమవుతోన్న పోలీసులు
12:33 PM, 27 Feb

మేమున్నాం..

వస్తువులు కొనుగోలు చేసేందుకు నిర్బయంగా బయటకు రావాలని ఢిల్లీ ప్రజలకు పోలీసుల పిలుపు
10:50 AM, 27 Feb

జడ్జీ ఎందుకు బదిలీ అంటే

జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయాలని ఈ నెల 12వ తేదీన కొలీజియం సిఫారసు చేసిందన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
10:34 AM, 27 Feb

భద్రతానీడన..

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో భద్రతా బలగాలను మొహరించడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోన్న చాంద్‌బాగ్, భాజన్‌పుర, ఖాజురి కాస్‌ రహదారులు
10:32 AM, 27 Feb

స్పెషల్ ఐఏఎస్

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో స్పెషల్ ఐఏఎస్ అధికారిగా జలాజ్ శ్రీ వాత్సవ నియామకం
10:31 AM, 27 Feb

34 మంది మృతి

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 34 మందికి చేరుకుంది
10:30 AM, 27 Feb

30 మందికి చేరిన ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య
9:13 AM, 27 Feb

భద్రతా బలగాల మొహరింపు

మౌజ్‌పూర్, సీలాంపూర్, బాబర్‌పూర్‌లో భద్రతా బలగాల మొహరింపు
8:47 AM, 27 Feb

28కి చేరిన మృతుల సంఖ్య

ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో 28కి చేరిన మృతుల సంఖ్య. జీటీబీ ఆస్పత్రిలో మరొకరు చనిపోయినట్టు వైద్యుల ప్రకటన
READ MORE

English summary
delhi clashes live updates: Violence over the Citizenship Amendment Act ontinued to escalate in North East Delhi on Tuesday taking the death toll to 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X