వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఏనుగు ఘటన మరవకముందే.. 13 కోతుల మృతి.. ఏం జరిగి ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

ఇటీవల కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భిణీ ఏనుగు మృతి దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కదిలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరవకముందే అసోంలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కచార్ జిల్లాలో ఉన్న కరీంగంజ్‌లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్(PHE) ప్రాజెక్టు పరిధిలోని ఓ వాటర్ ట్యాంకులో 13 కోతులు చనిపోయి కనిపించాయి.

కోతులకు ఎవరో విషం పెట్టడం వల్లే మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. కోతుల మృతి విషయాన్ని గమనించిన వెంటనే వారు పోలీసులు,అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ట్యాంకులో నుంచి కోతుల కళేబరాలను బయటకు తీసి పోస్టుమార్టమ్‌కు తరలించారు.

13 monkeys found dead in water tank in assam

కరీంగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(DFO) జల్నూర్ అలీ మాట్లాడుతూ.. ఇది హృదాయ విదారకమైన సంఘటన అన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. కోతుల మృతికి ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులు మాట్లాడుతూ.. కోతులకు విషం పెట్టి ఉంటారన్న అనుమానం కలుగుతోందన్నారు. విష ప్రభావంతో నొప్పికి తాళలేక.. నీళ్లు తాగేందుకు అవి ట్యాంకులో దిగి ఉంటాయని చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరిగితే తప్ప నిజానిజాలు తేలేలా లేవు.

Recommended Video

Delhi CM Arvind Kejriwal Unwell, To Undergo Covid-19 Test

కాగా,ఇటీవల కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఓ గర్భిణీ ఏనుగు బెల్లం పూసిన నాటు బాంబు తిని ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఏనుగుకు ప్రాణ హాని తలపెట్టారా.. లేక అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు పెట్టిన నాటు బాంబును ఏనుగు తిన్నదా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
After the death of a pregnant elephant in Kerala caused mass outrage, another heartbreaking incident has come to light from Assam’s Cachar district where 13 monkeys were found dead in a water tank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X