• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి, తండ్రి దూరం, సొంత చెల్లెలి మీద అన్న లైంగిక దాడి, తప్పించుకుని !

|

చెన్నై: ఇంటిలో తనతో పాటు కలిసి నివాసం ఉంటున్న సొంత సోదరి మీద అన్న లైంగిక దాడి చేశాడు. గత కొంత కాలంగా సొంత సహోదరిని లైంగిక వేదింపులకు గురి చేసిన అన్న వియషం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. చాలా కాలం ఓపిగా ఉంటున్న చెల్లెలు ఇక లాభం లేదని ఇంటి నుంచి తప్పించుకుని ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెల్లెలి మీద లైంగిక దాడి చేసిన అన్న మైనర్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించి విచారణ చేస్తున్నారు.

14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!

విడిపోయిన తల్లిదండ్రులు

విడిపోయిన తల్లిదండ్రులు

చెన్నైలోని విల్లివాక్కంలో నివాసం ఉంటున్న దంపతులకు 13 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం దంపతులు విడిపోవడంతో కుమార్తె, కుమారుడు తల్లితో కలిసి నివాసం ఉండేవారు.

ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి

ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి

భర్త దూరం కావడంతో గత సంవత్సరం తల్లి ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తన తల్లివేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో అన్నా, చెల్లి ఒంటరి అయ్యారు. చెన్నైలోని విల్లివాక్కంలోనే వేరే ఇంటిని అద్దెకు తీసుకున్న అన్నా, చెల్లెలు కలిసి జీవిస్తున్నారు. ఇంటిలో తల్లిదండ్రలు లేకపోవడంతో ఇద్దరే జీవిస్తున్నారు.

సొంత చెల్లి మీద కన్ను, చిత్రహింసలు

సొంత చెల్లి మీద కన్ను, చిత్రహింసలు

ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవడంతో అన్న అదుపుతప్పాడు. ఒంటరిగా తనతో పాటు జీవిస్తున్న చెల్లెలి మీద అన్న కన్ను పడింది. అంతే గత కొన్ని నెలల నుంచి అన్న సొంత చెల్లెలి మీద లైంగిక దాడికి పాల్పుడుతున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని, నీ కథ క్లోజ్ అంటూ అన్న చెల్లిని భయపెట్టాడు.

గత్యంతరం లేక ఓపికతో !

గత్యంతరం లేక ఓపికతో !

వావి వరుసలు మరిచిపోయి తన మీద లైంగిక దాడి చేస్తున్న అన్న అంటే చెల్లెలు భయపడిపోయింది. ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాను రోడ్డు మీద పడవలసి వస్తుందో అంటూ సోదరి ఇంతకాలం చాలా ఓపిగా ఉంది. అయితే రానురాను అన్న ఆగడాలు ఎక్కువ కావడంతో చెల్లెలు విసిగిపోయింది.

ఇంటి నుంచి పారిపోయిన చెల్లెలు

ఇంటి నుంచి పారిపోయిన చెల్లెలు

రానురాను అన్న చిత్రహింసలు పెట్టి లైంగిక దాడి చెయ్యడంతో చెల్లెలు విసిగిపోయింది. ఇంటి నుంచి తప్పించుకున్న చెల్లెలు నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని అన్న ఆగడాల గురించి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ కు గురైనారు. కేసు నమోదు చేసిన మహిళా ఇన్స్ పెక్టర్ మహేశ్వరి చెల్లెలి మీద లైంగిక దాడి చేస్తున్న 15 ఏళ్ల అన్నను అరెస్టు చేశారు. సోదరి మీద లైంగిక దాడి చేసిన బాలుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాలుడిని చెన్నైలోని కెల్లీస్ ప్రాంతంలోని జువైనల్ హోమ్ కు తరలించామని, బాలికకు వైద్యపరీక్షలు చేయించామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
13 year old girl complaint against her 15 yar old own brother in Chennai city in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X