వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటీశ్వరుడు కావాలని కూతురు నరబలి, మంత్రగత్తెతో లింక్, గంధర్వకోట కేసులో ట్వీస్ట్, పక్కాప్లాన్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పుదుకోటై/ గంధర్వకోట: నీళ్ల కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థిని గంధర్వకోటలోని తైలం తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు ఊహించని మలుపు తిరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఇప్పటికే పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే బాలిక తండ్రి గంటకు ఒకమాట చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి అతనికి బెండ్ తీశారు. తాను వెంటనే కోటీశ్వరుడు అయిపోవాలని ఓ మంత్రగత్తె సలహా ఇచ్చిందని, అందుకే తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి నరబలి ఇచ్చానని అంగీకరించడంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు. గంధర్వకోట బాలిక అనుమానాస్పద మృతి కేసులో కొత్త ట్వీస్ట్ బయటపడింది.

lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !

 8వ తరగతి విద్యార్థిని

8వ తరగతి విద్యార్థిని

తమిళనాడులోని పుదుకోటై జిల్లా గంధర్వకోటలోని నొడియురులో నివాసం ఉంటున్న దివ్య (13) అదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. గత నెల 18వ తేదీన ఇంటి దగ్గరే ఉన్న దివ్య సమీపంలోని తైలం తోటలో మంచినీళ్లు తీసుకురావడానికి ఒంటరిగా వెళ్లింది. తరువాత తైలం తోటలో తీవ్రగాయాలైన దివ్య అపస్మారకస్థితిలో పడి ఉన్న విషయం స్థానికులు గుర్తించారు.

 గ్యాంగ్ రేప్ చేశారని కేసు

గ్యాంగ్ రేప్ చేశారని కేసు

కొన ఊపిరితో ఉన్న దివ్యను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను తంజావూరులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై దివ్య మరణించింది. తన కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని దివ్య తండ్రి పన్నీరుసెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నొడియురులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమైదన శైలిలో విచారణ చేసినా ఆ కేసు తైలం తోటకే పరిమితం కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

 పోస్టుమార్టుం నివేదికలో ట్వీస్ట్

పోస్టుమార్టుం నివేదికలో ట్వీస్ట్

దివ్య శరీరం మీద అనేక గాయాలు కావడం, తీవ్రంగా రక్తం పోవడంతో పోలీసులతో సహ అందరూ ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం గ్యాంగ్ రేప్ కోణంలోనే విచారణ చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఇదే సమయంలో బాలిక మీద అత్యాచారం జరగలేదని, చిత్రహింసలకు గురి చేసి చంపేశారని వైద్యులు పోస్టుమార్టుం నివేదిక ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

 గంటకు ఒక మాట చెప్పిన తండ్రి

గంటకు ఒక మాట చెప్పిన తండ్రి

దివ్య తండ్రి పన్నీర్ సెల్వంను గంధర్వకోట పోలీసులు విచారణ చెయ్యగా అతను గంటకు ఒకసారి పొంతనలేని మాటలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు పన్నీర్ సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. అతను చెప్పిన మాటలను రికార్డు చేశారు. పన్నీర్ సెల్వం మాటల్లో తేడా కనిపించడంతో పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విషయం బయటపడింది.

 ఇలా చెయ్యి.... కోటీశ్వరుడు అయిపోతావ్ !

ఇలా చెయ్యి.... కోటీశ్వరుడు అయిపోతావ్ !

దివ్య తండ్రికి మూడనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఓ మంత్రగత్తె పన్నీర్ సెల్వంను కలిసి నువ్వు వెంటనే కోటీశ్వరుడు అయిపోవాలంటే నీ కూతురిని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా నరబలి ఇవ్వాలని చెప్పింది. ఈ విషయం మూడో కంటికి తెలీకుండా పని పూర్తి చెయ్యాలని మంత్రగత్తె పన్నీర్ సెల్వంకు సూచించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 రాత్రి పక్కాప్లాన్ వేసిన తండ్రి

రాత్రి పక్కాప్లాన్ వేసిన తండ్రి

గతనెల 17వ తేదీ రాత్రి తైలం తోటలోకి వెళ్లిన పన్నీర్ సెల్వం కూతురు దివ్య నరబలికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మరుసటి రోజు 18వ తేదీన దివ్యను తైలం తోటలో నీళ్లు తీసుకురావాలని చెప్పాడు. నీళ్లు తీసుకురావడానికి తైలం తోటలోకి వెళ్లిన కుమార్తె దివ్యను తండ్రి పన్నీర్ సెల్వం పట్టుకున్నాడు. తరువాత ఆమెను చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హింసించి గొంతు నులిమాడు. కుమార్తె దివ్య చనిపోయిందని, తన పని పూర్తి అయ్యిందని అనుకున్న పన్నీర్ సెల్వం అక్కడి నుంచి ఊరిలోకి వచ్చేశాడు.

 ఊరి ప్రజలతో కలిసి నాటకం

ఊరి ప్రజలతో కలిసి నాటకం

దివ్య కొన ఊపిరితో ఉన్న విషయం ఊరి ప్రజలు చూడటం, విధిలేని పరిస్థితిలో పన్నీర్ సెల్వం ఆమెను తంజావూరు ఆసుపత్రికి తరలించాడు. అయితే ఎక్కడ తన మీదకు వస్తుందో అనే భయంతో పన్నీర్ సెల్వం తన కుమార్తె మీద గ్యాంగ్ రేప్ జరిగిందని కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. అయితే పోస్టుమార్టుం నివేదికతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చెయ్యడంతో తండ్రి పన్నీర్ సెల్వం అతను తవ్వుకున్న గోతిలో అతనే పడటంతో పోలీసులకు చిక్కిపోయాడు. దివ్యను దారుణంగా హత్య చేసిన పన్నీర్ సెల్వంతో పాటు నరబలి ఇవ్వాలని చెప్పిన మంత్రగత్తె, వారికి సహాయం చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని గంధర్వకోట పోలీసులు తెలిపారు.

English summary
13 year old girl murder case father and arrested 3 near Pudukkottai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X