• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిరుద్యోగ భారతం : కరోనావైరస్‌తో డేంజర్‌లో ఉద్యోగాలు..అది మాత్రమే కాపాడుతుందట..!

|

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో దేశంలో ప్రధాన రంగాలు నష్టాల బాట పట్టాయి. అదే సమయంలో చాలా ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీలు కూడా నష్టాలు చవిచూశాయి. ఇదిలా ఉంటే కరోనావైరస్ కారణంగా ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా ఓ సంస్థ ఇచ్చిన నివేదిక చూస్తే భవిష్యత్తులో భారత్‌లో మరింత మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!

120 మిలియన్ మంది పేదరికం వైపు..

120 మిలియన్ మంది పేదరికం వైపు..

కోవిడ్-19తో అంతా నష్టమే వచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి ఈ వార్త ఒక్కింత నిరాశే కలిగిస్తుంది. భవిష్యత్తులో భారత్‌లో 135 మిలియన్ ఉద్యోగాలకు ఆయా సంస్థలు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. దీని ద్వారా 120 మిలియన్ మంది ఉద్యోగస్తులు పేదరికంలోకి నెట్టివేయబడుతారని ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డీ లిటిల్ అంచనావేసింది. అంటే ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వారిపై ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్, ఇలాంటి వాటిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది.

క్షీణించనున్న జీడీపీ

క్షీణించనున్న జీడీపీ

కోవిడ్ -19 ప్రభావం పేదలపై అధిక ప్రభావం చూపుతుందని ఆ నివేదిక వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం పెరగకపోవడం, పేదరికం పెరగడం వంటివి చోటుచేసుకుంటాయని తద్వారా దేశ స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)పై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తత పరిస్థితులను చూస్తే భారత్‌లో జీడీపీ గ్రాఫ్ 'W'రూపంలో ఉందని వెల్లడించింది. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.8శాతం మేరా తగ్గిపోనుండగా అది 2021-22కు 0.8శాతం మాత్రమే వృద్ధి ఉంటుందని జోస్యం చెప్పింది. ఇక అంచనా వేస్తున్న జీడీపీ లెక్కలను చూస్తే ఈ ప్రభావం ఎక్కువగా ఉద్యోగస్తులపై ఉద్యోగాలపై పడుతుందని చెబుతోంది.అంతేకాదు పేదరికం పెరగడం, పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌లపై కూడా పడుతుందని అంచనా వేస్తోంది.

35శాతంకు పెరగనున్న నిరుద్యోగిత రేటు

35శాతంకు పెరగనున్న నిరుద్యోగిత రేటు

ప్రస్తుతం ఉన్న 7.6శాతం నిరుద్యోగిత 35 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో 136 మిలియన్ ఉద్యోగాలు పోతాయని 174 మిలియన్ మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తోంది. దీంతో 120 మిలియన్ మంది పేదరికంలోకి నెట్టివేయబడుతారని చెబుతోంది. ఇక భారత్‌ 1 ట్రిలియన్ అమెరికా డాలర్ల మేరా నష్టం చవిచూస్తుందని అంచనా వేస్తోంది ఆర్థర్ డీ లిటిల్ సంస్థ నివేదిక. అయితే ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఈ సమయంలో మంచి అడుగని నివేదిక స్పష్టం చేసింది. ఇక ఈ విపత్కర సమయంలో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తీసుకున్న నిర్ణయాలను కొనియాడిన నివేదిక... ఇది సరిపోదని ఈ మహమ్మారి నుంచి ఆర్ధికంగా కోలుకోవాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

 మేకిన్ ఇండియా 2.0 ప్రవేశపెట్టాల్సిందే..

మేకిన్ ఇండియా 2.0 ప్రవేశపెట్టాల్సిందే..

ఇక పేదరికంను ఎలా జయించాలనేదానిపై 10 పాయింట్లతో కూడిన సూచనలు చేసింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు తిరిగి పుంజుకోవాలంటే ఏమి చేయాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించడం, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పలు రంగాలను తిరిగి కాపాడుకోవడం ఎలా అనే అంశాలకు సంబంధించి సూచనలు చేసింది నివేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మేకిన్ ఇండియా 2.0 ప్రారంభించాలని సూచించింది. దీని ద్వారా భారత్‌లో డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్‌కు ఊతమివ్వడంతో పాటు ప్రపంచ దేశాల పెట్టుబడుల కార్యక్రమం బలోపేతం అవుతుందని పేర్కొంది.

English summary
Indians may lose 135 million jobs due to covid-19 says a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X