వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:ఇప్పుడు ఢిల్లీలో.. 14మంది వైద్యసిబ్బందికి వైరస్, క్వారంటైన్‌లో డాక్టర్లు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకిన రోగులకు అందిస్తోన్న వైద్య సిబ్బందికి కూడా వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 54 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకిందని విషయం మరవకముందే... దేశ రాజధానిలో కూడా మరికొందరికీ వచ్చిందని తెలిసింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జహంగిరిపురిలో వైద్యసిబ్బందికి వ్యాధి అంటుకుంది.

ఢిల్లీ జహంగిరిపురి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న దాదాపు 14 మంది డాక్టర్లు, నర్సులకు వ్యాధి సోకింది. వైద్య సిబ్బందికి వైరస్ సోకిందనే విషయం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పంజాబ్‌లోని ఫాగ్వారాకు చెందిన 6 నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిడియాట్రిక్ సెంటర్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. వెంటిలేటర్‌పై ఉంచే క్రమంలో వైరస్ బయటపడింది. దీంతో వైద్యులు ఆందోళన చెందారు. డాక్టర్లు సహా 54 మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

14 Doctors and Nurses Test Positive at Delhi Govt Hospital

ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారిసంఖ్య 2 వేల 376 మందికి చేరింది. గురువారం ఒక్కరోజే 128 మందికి పాజిటివ్ కేసులు నమోదవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మృతుల సంఖ్య 50కి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వైరస్ సోకిన వారి సంఖ్య 4 వేలకు చేరింది. గురువారం ఒక్కరోజే 478 మందికి వ్యాధి సోకిందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 168 మంది చనిపోయారని పేర్కొన్నారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

English summary
14 doctors and nurses have tested positive for coronavirus at a Delhi government hospital in Jahangirpuri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X