వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది దుర్మరణం, బస్సులో ప్రయాణికులు !

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెలుతున్న బస్సును ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో 14 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 22 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !

సోమవారం వేకువ జామును రాజస్థాన్ లోని బీకనీర్ నుంచి 45 మంది ప్రయాణికులతో బస్సు జైపూర్ బయలుదేరింది. మార్గం మధ్యలో బీకనీర్-జైపూర్ జాతీయ రహదారి 11లోని దుంగార్గర్ సమీపంలో బస్సును ఎదురుగా వేగంగా వెళ్లిన ట్రక్కు ఢీకొనింది.

14 Killed as bus, truck collide near Bikaner in Rajasthan

ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 22 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో మరో నలుగురు మరణించారని పోలీసులు అన్నారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

లగ్జరీ కారులో పారిశ్రామిక వేత్త సజీవదహనం, లేడీతో వల, కిడ్నాప్, భాగస్వామి కిరాతకం !లగ్జరీ కారులో పారిశ్రామిక వేత్త సజీవదహనం, లేడీతో వల, కిడ్నాప్, భాగస్వామి కిరాతకం !

విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ట్రక్కు బలంగా బస్సును ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు అన్నారు.

నవంబర్ 12వ తేదీన బీకనీర్ జిల్లాలోని పలన గ్రామం సమీపంలో మిని బస్సు- జీపు ఢీకొనడంతో 7 మంది దుర్మరణం చెందారు. బీకనీర్ జిల్లాలోని జాతీయ రహదారిలో పదేపదే ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
Jaipur: At least 14 people were killed and 18 others injured in a collision between a bus and a truck in Rajasthan's Bikaner district on Monday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X