వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో విషపూరిత పండ్లను తిని 14 మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్: విషపూరితమైన అడవి పళ్లు తిని అస్సాంలోని దుబ్రి జిల్లాకు చెందిన 14 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మేఘాలయలోని తూర్పు జైనతేయ కొండల్లో చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

మృతి చెందిన వారంతా అస్సాంలోని దుబ్రి జిల్లా చెందిన వారిగా గుర్తించామన్నారు. సాయిపుంగ్‌ జిల్లాకు 15 కిలోమీటర్లు దూరంలో ఉంపంగ్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం వీరంతా మేఘాలయకు కూలీ పనుల కోసం వచ్చారని తెలిపారు.

 14 labourers found dead in Meghalaya after consuming wild fruits

ప్రాధమిక విచారణలో వీరంతా సమీపంలోని అడవిలోకి వెళ్లి విషపూరితమైన పండ్లను తిని మృతి చెందినట్లు తేలిందని జైనతేయ హిల్స్ ఎస్పీ ఎమ్‌కే ధకర్ వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఆదివారం రాత్రి విషపూరితమైన పండ్లను తిని నిద్రకు ఉపక్రమించిన వీరంతా సోమవారం తెల్లవారే సరికే చనిపోయారని పోలీసులు ధ్రువీకరించారు.

English summary
Fourteen labourers hailing from Assam's Dhubri district died in their camp at a remote village in Meghalaya's East Jaintia Hills district after allegedly consuming poisonous wild fruits, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X