హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎస్‌లో చేరేందుకే: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన 14మంది విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు బ్రిటన్, యూరోపియన్ దేశాలకు వెళ్లిన పలువురు విద్యార్థులు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు సిరియా, ఇరాక్‌కు బయల్దేరిన 14 మంది విద్యార్థులను హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో కొంతమంది ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారందరూ బ్రిటన్, యూరోపియన్ దేశాల నుంచే వచ్చినట్లుగా నిర్ధారించలేమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలకు చెందిన అతీఫ్ వసీమ్ అనే యువకుడు ఐఎస్ఐఎస్ కోసం పనిచేసి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగాలు ఐఎస్‌లో చేరేవారిపై నిఘావేసి ఉంచాయి. హైదరాబాద్‌లోని షాదన్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివిని వసీమ్ మొబైల్ ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ విభాగాలు పరిశీలిస్తున్నారు. ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరిన 11 మంది యువకులను ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

 14 students, planning to join Islamic State, stopped at Hyderabad airport

సోలమన్ మోయినుద్దీన్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ‘యువకులందరూ వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారు. మనం ఇక్కడ ఉండగానే వారిపై కన్నేసి ఉంచగలం. ఒక్కసారి దేశం దాటితే వారిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇంటర్నెట్ ఉపయోగించి వారు చాలా కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువమంది హైదరాబాద్‌కు చెందినవారు కాగా, మరికొందరు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందినవారున్నారు' అని ఆ అధికారి చెప్పారు.

ఇటీవల మృతి చెందిన వసీమ్ మొదట మాస్టర్స్ చేసేందుకు లండన్ వెళ్లాడు. కాగా, తమకు అరబిక్ భాషలో ఓ ఎస్ఎంఎస్ వచ్చిందని అతని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఇటీవల ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ మాజీ గూగుల్ ఉద్యోగితోపాటు ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖతార్‌లో ఉంటున్న నగరానికి చెందిన ఓ యువతి కూడా ఐఎస్‌లో చేరేందుకు విఫలయత్నం చేసింది. ఇరాక్ వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నలుగురిని కూడా కోల్‌కతాలో అరెస్ట్ చేశారు.
ఐఎస్ చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ చక్రవ్యూహ్ ఇప్పటికే ప్రారంభించింది. నిరంతరం నిఘా పెట్టి ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుంటున్నట్లు ఐబి తెలిపింది. ఈ యువకులు మళ్లీ ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

English summary
Some students going to Britain and other European countries from Hyderabad and other parts of Telangana to pursue MS in engineering, are falling prey to the Islamic State. According to state intelligence agencies, 14 people have been identified including those who have joined IS or were stopped at the airports on their way to Syria and Iraq.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X