వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో పిల్లలు కూడ నిర్భంధంలోనే....!

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాన్ని పూర్తి భద్రత వలయంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజలను ప్రభావితం చేసే నాయకులను , పార్టీల నేతలను, వారి కుటుంభ సభ్యులను సైతం గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. అయితే పోలీసులు గృహ నిర్భంధంలో తీసుకున్న వారిలో మైనర్‌లు కూడ ఉండడం గమనార్హం. 9 నుండి 18 సంవత్సరాల బాలురు, బాలికలను సైతం అక్రమంగా గృహనిర్భంధంలో పెట్టారు.

కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షాకశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షా

 ఆర్టికల్ రద్దు తర్వాత మారిన కశ్మీర్ పరిస్థితులు

ఆర్టికల్ రద్దు తర్వాత మారిన కశ్మీర్ పరిస్థితులు

ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్‌లో పూర్తిగా పరిస్థితులు మారాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటీ వ్యతిరేకత రాకుండా పూర్తిగా నిర్భంధం విధించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అరెస్ట్ చేసి, గృహనిర్భంధంలో పెట్టారు. చాలా రోజుల పాటు కర్ఫ్యూ విధించిన పోలీసులు సుమారు 10వేల మందిని నిర్భంధంలోకి తీసుకున్నారు. అందులో పార్టీల అధినేతలు, నాయకులు, వారి కుటుంభ సభ్యులు, పిల్లలు సైతం ఉన్నారు.

హక్కుల ఉల్లంఘనపై స్పందించిన చీఫ్ జస్టీస్

హక్కుల ఉల్లంఘనపై స్పందించిన చీఫ్ జస్టీస్

దీంతో పూర్తిగా మానవహక్కుల హరించే విధంగా కశ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల ఉక్కుపాదంతో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందంటూ పలువురు సుప్రిం కోర్టును ఆశ్రయించారు. ఒకదశలో సుప్రిం కోర్టు చీఫ్ జస్టిస్ అయిన రంజన్‌ గగోయ్ సైతం తానే స్వయంగా కశ్మీర్‌లో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మైనర్లను సైతం నిర్భంధంలో పెట్టారంటూ పలు పిటిషన్లు సుప్రిం కోర్టుకు చేరాయి.

సుప్రిం ఆదేశాలతో కదిలిన జువైనల్ కమిటి

సుప్రిం ఆదేశాలతో కదిలిన జువైనల్ కమిటి

దీంతో పిటిషన్లపై స్పందించిన సుప్రిం కోర్టు విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక పంపాలని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్ హైకోర్టు రాష్ట్రంలోని జువైనల్ కమిటి విచారణ చేపట్టాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో పర్యటించిన బృందం మొత్తం రాష్ట్రంలో ఆగస్టు 5నుండి నేటి వరకు 144 మంది మైనర్ పిల్లలను నిర్భంధంలో ఉంచినట్టు నివేదికలో పేర్కోన్నారు. కాగా వారంతా 9 నుండి 18 సంవత్సరాల లోపు వారేనని వివరించారు.మరోవైపు సుప్రిం కోర్టుకు చేరిన పిటిషన్లను విచారించేందుకు సుప్రిం కోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణను ప్రారంభించనుంది.

English summary
144 juveniles aged between 9 years and 17 years and in conflict with the law were arrested from August 5.THE JUVENILE Justice Committee told the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X