వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబ్ ఎఫెక్ట్: బెంగళూరులో మూడురోజులు 144 సెక్షన్, గురువారం ఉదయం నుంచి అమలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈశాన్య భారతదేశం భగ్గుమనగా.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పౌరసత్వ సెగలు రేగాయి. పౌరుల ఆందోళనల మధ్య బెంగళూరులో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పౌరసత్వ సవరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా, కఠిన చర్యలంటూ హెచ్చరికపౌరసత్వ సవరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా, కఠిన చర్యలంటూ హెచ్చరిక

ఐటీ హబ్‌లో బెంగళూరులో కూడా నిరసనలు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చకముందే బెంగళూరు పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి నగరంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. గురువారం నుంచి మూడురోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు.

144 Section imposed for 3 days in Bengaluru

గురువారం నుంచి 144 సెక్షన్ అమల్లోకి వస్తోన్నందున ఏ నలుగురు గుమికూడొద్దని పోలీసులు సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు. లేదంటే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. క్యాబ్‌ను నిరసిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించంది. బిల్లును రాజ్యాంగ ధర్మాసనానికి పరిశీలించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నది. కానీ బిల్లును రద్దు చేయమని ప్రభుత్వానికి చెప్పలేమని తెలిపింది. పిటిషన్లను జనవరి 22వ తేదీన విచారిస్తామని చెప్పింది. బుధవారం నాటి పిటిషన్లతోపాటు 59 పిటిషన్లను తదుపరి వాయిదారోజున విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

English summary
144 Section has been imposed in Bengaluru for 3 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X