వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమా కోరేగావ్ వార్షికోత్సవం: 17 గ్రామాల్లో టెన్షన్..టెన్షన్: 114 సెక్షన్: వారం ముందే నిఘా

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన.. భీమా-కోరేగావ్. 2018 జనవరి 1వ తేదీన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, దళిత నేతల అరెస్టుల పర్వం మూడో ఏడాదిలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భీమా-కోరేగావ్‌లో దళిత సంఘాల నేతలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని భావించిన మహారాష్ట్ర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

శ్రీవారిని దర్శించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్: భార్యతో కలిసి ఏడుకొండలవాడి సేవలోశ్రీవారిని దర్శించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్: భార్యతో కలిసి ఏడుకొండలవాడి సేవలో

17 గ్రామాల్లో 114 సెక్షన్..

17 గ్రామాల్లో 114 సెక్షన్..


భీమా-కోరేగావ్ సహా చుట్టుపక్కల ఉన్న 17 గ్రామాల్లో పోలీసులను మోహరింపజేశారు. 114 సెక్షన్‌ను విధించారు. ఈ నెల 31వ తేదీన తెల్లవారు జామున 6 గంటల నుంచి జనవరి 2వ తేదీన తెల్లవారు జామున 6 గంటల వరకు 114 సెక్షన్‌ అమల్లో ఉంటుందిన పుణే పోలీసులు తెలిపారు. భీమా-కోరెగావ్ వార్షికోత్సవానికి వారం రోజుల ముందు నుంచే పోలీసులు అప్రమత్తం కావడం, ఎలాంటి అవాంఛనీయయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

బయటి వ్యక్తులెవరూ వెళ్లకుండా..

బయటి వ్యక్తులెవరూ వెళ్లకుండా..

కోరేగావ్, భీమా, షిక్రాపూర్, లోని కండ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 114 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో స్థానికులెవరూ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని, గుమికూడొద్దని పోలీసుల హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో బయటి వ్యక్తులెవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త వ్యక్తులెవరినీ ఆయా గ్రామాల్లో అడుగు పెట్టనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పుణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రకటించింది. బయటి వ్యక్తులెవరూ 17 గ్రామాలకు వెళ్లొద్దని సూచించింది.

పాసులు ఉన్నవారికి మాత్రమే..

పాసులు ఉన్నవారికి మాత్రమే..

భీమా-కోరేగావ్ విజయానికి సూచికగా అక్కడ నెలకొల్పిన జయ్ స్తంభ్‌ను సందర్శించడానికి అతి కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పుణే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దీనికోసం పాసులను జారీ చేసినట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్నవారు మాత్రమే విడివిడిగా జయ్ స్తంభ్‌ను సందర్శించడానికి అనుమతి ఉందని స్పష్టం చేశారు. 1818 జనవరి 1వ తేదీన పేష్వా-బ్రిటీషర్ల మధ్య జరిగిన యుద్ధానికి గుర్తుగా, అందులో అమరులైన వారికి నివాళి అర్పిస్తూ భీమా-కోరేగావ్‌లోని జయ్ స్తంభ్ వద్ద వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

వరవరరావు సహా పలువురు అరెస్ట్..

వరవరరావు సహా పలువురు అరెస్ట్..

2018లో అల్లర్లు చోటు చేసుకున్న అనంతరం దీనిపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అప్పటి ఘటనలో ఒకరు మరణించగా..పలువురు గాయపడ్డారు. 162 మందిపై 58 కేసులు నమోదు అయ్యాయి. తెలుగు విప్లవ రచయిత వరవరరావుపైనా భీమా-కోరేగావ్ కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. వరవర రావు, అరుణ్ ఫెర్రెరియా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖ వంటి పలువురు అరెస్టు అయ్యారు. వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్‌ను నమోదు చేసింది. పుణేలోని శనివార్‌వాడాలో ఎల్గార్ పరిషద్ పేరుతో సమావేశమైన వారంతా మావోయిస్టులతో చేతులు కలిపి విధ్వంసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

English summary
Pune Municipal Corporation (PMC) imposed section 144 in 17 villages, including Perne Phata and Koregaon Bhima area from December 30 ahead of the Bhima Koregaon battle anniversary event scheduled on January 1, 2021. As per PMC's order Section, 144 will be imposed from December 30 to January 2, 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X