వ్యానిటీ బ్యాగ్ లో రూ. 3.90 లక్షల రూ. 2 వేల నోట్లు

వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న రూ. 3.90 లక్షలను (రూ. 2,000, రూ.100 నోట్లు) కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా గేట్ దగ్గర పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు: వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న రూ. 3.90 లక్షలను (రూ. 2,000, రూ.100 నోట్లు) కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా గేట్ దగ్గర పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఫిరోజ్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్ లో భారీ మొత్తంలో నగదు ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి వ్యానిటీ బ్యాగ్ పరిశీలించారు. ఆ వ్యానిటీ బ్యాగ్ లో ఇటీవలే చలామణిలోకి వచ్చిన రూ. 2,000 నోట్లతో పాటు రూ. 100 నోట్లు దర్శనం ఇచ్చాయి.

15.90 lakh rupees seized near Tumakuru in Karnataka

ఫిరోజ్ ను విచారించగా అతను సినిమా కథలు చెబుతున్నాడని పోలీసులు అన్నారు. తనకు పరిచయం ఉన్న వారు ఈ వ్యానిటీ బ్యాగ్ ఇచ్చి వెళ్లారని పోలీసులకు చెప్పాడు. బ్యాగ్ లో నిర్మలా అనే మహిళ ఐడీ కార్డు ఉందని. ఫిరోజ్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

తుమకూరులోని జయనగర లేఔట్ లో పోలీసులు రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి రాఘవేంద్ర, జుబేర్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+