వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్‌లో ఆర్డీఎక్స్‌ సరఫరా చేసిన ఉగ్రవాదులు...

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల అణిచివేతకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. ఉగ్రమూకలు మాత్రం తమపని తాము చాపకిందనీరులా చేసుకుపోతున్నారు. గత నెల రోజులుగా కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడంతో పాటు రవాణ వ్యవస్థపై కూడ భద్రతా దళాలు దృష్టి సారించారు. అయినా తీవ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరించారు. ప్రైవేట్ రవాణ వ్యవస్థపై నిఘా కట్టుదిట్టం చేయడంతో ఉగ్రవాద కార్యాకలాపాలకు ప్రభుత్వ రవాణ వ్యవస్థనే ఉపయోగించున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులోనే పేలుడు పదార్థాలను సరఫరా చేశారు..

దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే..! కశ్మీర్‌ విషయంలో పాక్ కు షాకిచ్చిన అఫ్గాన్‌..!!దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే..! కశ్మీర్‌ విషయంలో పాక్ కు షాకిచ్చిన అఫ్గాన్‌..!!

జమ్ము కశ్మీర్‌లో మరో భారీ పేలుడుకు అట్టకట్ట వేశాయి భద్రతా దళాలు. జమ్ములోని ఆర్టీసీ బస్సులో 15 కిలోల ఆర్డీఎక్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. బిలావర్ నుండి జమ్ము బస్టాండ్‌కు వచ్చిన బస్సులో పేలుడు పదార్థాలను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన భద్రతా దళాలు ఇంతపెద్ద మొత్తంలో ఆర్డీఎక్స్‌ బస్సులోకి ఎలా చేరిందనే కోణంలో విచారణ జరిపారు. బస్సు డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ను విచారించారు. బిలావర్ ప్రాంతంలో ఓ మహిళ ప్యాక్ చేసిన పెట్టెను డ్రైవర్‌కు ఇచ్చిందని దీన్ని జమ్ములోని తమ బంధువులు ఆ బాక్స్‌ను తీసుకుంటారని చెప్పినట్లు విచారణలో తేలినట్టు సమాచారం.

 15 kgs of explosives have been found in a bus at the Jammu bus stand.

మరోవైపు ఆర్డీఎక్స్ పట్టుపడ్డ నేపథ్యంలోనే జమ్ములోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో 40 కిలోల గన్‌పౌడర్‌ను కూడ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో గత నెలరోజులుగా ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉగ్రమూకలు మరో భారీ పేలుడుకు ప్లాన్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
15 kgs of explosives have been found in a bus at the Jammu bus stand.The bag full of explosives was given to the conductor of the bus in Bilawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X