వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఒక్క ఛాన్స్..నిర్భయ నీచులను ఉరితీస్తాం: తీహార్ జైలుకు వెల్లువెత్తుతున్న లేఖలు

|
Google Oneindia TeluguNews

2012 డిసెంబర్ 16... ఢిల్లీ నడివీధుల్లో నిర్భయపై కదిలే బస్సులో అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది నిర్భయ. నిందితులకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. నిర్భయపై దుర్మార్గపు ఘటన జరిగి ఏడేళ్లు కావొస్తోంది.తీరా ఉరి అమలు చేసే సమయానికి ఉరివేసేందుకు దళారులు దొరకడం లేదంటూ తీహార్ జైలు అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిందితులను ఉరితీస్తామంటూ తీహార్ జైలు పాలనా యంత్రాంగానికి 15 లేఖలు వచ్చాయి. ఇందులో రెండు లేఖలు విదేశాల నుంచి రావడం విశేషం.

నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?

నిందితులను మేమే ఉరితీస్తాం

నిందితులను మేమే ఉరితీస్తాం

ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పౌరులు లేఖలు రాశారని తీహార్ జైలు అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు విదేశాల నుంచి రెండు లేఖలు వచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. ఇందులో ఒకటి లండన్ నుంచి మరొకటి అమెరికా నుంచి వచ్చాయని చెప్పారు.ఇక నిర్భయ నిందితులకు ఉరి వేస్తామని లేఖలు రాసిన వారిలో ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్, ఒకరు అడ్వకేట్ మరొకరు సీనియర్ సిటిజెన్లు ఉన్నారని చెప్పారు. ఇక తప్పని పరిస్థితుల్లో నిందితులకు జైలు అధికారే ఉరివేస్తారని స్పష్టం చేశారు. అఫ్జల్ గురు కేసులో ఇదే జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

కోర్టు నెంబర్ 3లో నిర్భయ నిందితులకు ఉరి

కోర్టు నెంబర్ 3లో నిర్భయ నిందితులకు ఉరి

ఇక నిందితులు వివిధ జైల్లో ఉండగా గతవారాంతంలో అందరినీ తీహారు జైలుకు తీసుకొచ్చారు. మీరట్ జైలులో పనిచేసే దళారిని ఉరి తీసేందుకు గతంలో వినియోగించుకుంది తీహార్ జైలు.తీహార్ జైలులో కోర్టు నెంబర్ 3లో నిర్భయ నిందితులకు ఉరి తీయనున్నారు. ఇందుకోసం అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు తీహార్ జైలు అధికారులు. గతంలో ఉరితీయబడ్డ కశ్మీర్ వేర్పాటు వాది మక్భూల్ భట్, అఫ్జల్ గురులను ఎక్కడైతే పూడ్చారో అక్కడే ఈ నిర్భయ నిందితులను కూడా పూడ్చడం జరుగుతుందని సమాచారం. ఈ స్థలాన్ని ఫన్సీ - కొత అని పిలుస్తారు.

 ఉరి తీశాక మృతదేహాలను పూడ్చేది ఇక్కడే

ఉరి తీశాక మృతదేహాలను పూడ్చేది ఇక్కడే

తీహార్ జైలు కాంపౌండ్‌లో ఫన్సీ - కొత అత్యంత భద్రత కలిగిన వార్డు. ఈ వార్డుకు భద్రతగా తమిళనాడు రాష్ట్ర పోలీసులు ఉంటారు. ఈ ప్రాంతంలో అత్యంత కిరాతకమైన నిందితులను ఉంచుతారు. ఇక్కడ తమిళనాడు రాష్ట్ర పోలీసులు, క్రిమినల్స్‌కు ఆహారం అందించే వార్డు సిబ్బంది తప్ప ఇంకెవరూ ఉండరు. ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ వార్డు తలుపులు తెరుచుకుంటాయని అధికారి చెప్పారు. అది కూడా శుభ్రం చేయాలని భావించినప్పుడే తెరుచుకుంటాయని చెప్పారు. ఇక ఈ వార్డులో ఉన్న నిర్భయ నిందితుల ప్రవర్తనను 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఉరితీసే రోజున వారి ఆరోగ్యంను మరోసారి డాక్టర్ పరిశీలిస్తారని చెప్పారు. ఇప్పటికే నిర్భయ నిందితుల్లో ఒకరైన రాంసింగ్ 2013లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిందితులకు అన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది

నిందితులకు అన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది


జైలు నిబంధనల ప్రకారం నిందితులకు క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి తిరస్కరించడం జరిగిందని తెలపాల్సి ఉంటుంది. నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అది తిరస్కరించడమైంది. మిగతా వారు ఇంకా క్షమాభిక్ష పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోలేదు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే వెసులు బాటు కల్పిస్తున్నామని నిందితులకు అక్టోబర్ 27న జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక అది జరగని పక్షంలో ఉరివేసే ప్రక్రియను తీహార్ జైలు అధికారులు ప్రారంభిస్తారు.

English summary
The Tihar prison administration has received at least 15 letters from citizens who have volunteered to hang the four convicts of the December 16 Delhi gang rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X