వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి ఓటు వేయబోతున్నవారి సంఖ్య ఎంతో తెలుసా? పేరును చెక్ చేసుకోవడానికి ప్రత్యేక హెల్ప్ లైన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి మనదేశ యువత ఆసక్తి చూపుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి యువత పెద్ద ఎత్తున తమ పేర్లను నమోదు చేసుకుంది. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 90 కోట్లకు పైమాటే. వారిలో కొత్తగా ఓటును వేయబోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఓటరు జాబితాలో తొలిసారిగా వారు తమ పేరును నమోదు చేసుకున్నారు.

18 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న యువత 15 లక్షల మందికి పైగా తమ పేరును నమోదు చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా సునీల్ అరోరా.. ఓటర్ల సంఖ్యను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి పైగా తమ ఓటర్లు ఉన్నారని చెప్పారు. వారిలో 18-19 వయస్సున్న వారి సంఖ్య 15 లక్షలకు పైగా ఉందని అన్నారు.

15 million voters registered their names in list between 18-19 age group

ఓటరు జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు

ఓటరు జాబితాలో తమ పేరు ఉందో? లేదో తనిఖీ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటును చేసింది. అదే హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్ నంబర్ 1950. 24 గంటల పాటు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చని సునీల్ అరోరా తెలిపారు. ఓటర్లు తమ పేరును చెక్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా కనుక్కోవచ్చని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ ఏర్పాటు చేశామని అన్నారు.

English summary
CEC Sunil Arora announced that 1950 is the election helpline number to check your name and election-related information. It will be works 24/7 he told. Sunil Arora told reporters that 15 million young voters goint to poll in this elections. Total electorate in this Lok Sabha elections will be 900 million, of which 15 million voters are in the 18-19 age group, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X