వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ టీసీ బస్సును ఢీకొట్టిన కంటెయినర్: 15 మంది దుర్మరణం, నిద్రలోనే ప్రాణాలు, డ్రైవర్లు!

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో హోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్దరాత్రి మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఆర్ టీసీ బస్సును కంటెయినర్ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. మరో 30 మందికి తీవ్రగాయాలు కావడంతో ధూలే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గాయపడిన వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి మహారాష్ట్రకు చెందిన ఆర్ టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో ఔరంగాబాద్ బయలుదేరింది. మార్గం మధ్యలో ధూలే జిల్లాలోని శహెదా- డూండైచా మార్గం మధ్యలో నిమ్గల్ గ్రామం సమీపంలో ఆర్ టీసీ బస్సు- కంటెయినర్ వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.

15 people dead, 35 were injured after bus collides with truck in Dhule in Maharashtra

ఆర్ టీసీ బస్సును ఎడమ భాగం నుంచి కంటెయినర్ దూసుకుపోవడంతో బస్సులో ఉన్న 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కంటెయినర్ డ్రైవర్, అదే వాహనంలోని మరో వ్యక్తి, ఆర్ టీసీ బస్సు డ్రైవర్ దుర్మరణం చెందారు.

విషయం గుర్తించిన స్థానిక గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరకుని భాదితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ధూలే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు వాహనాల డ్రైవర్లు నిర్లక్షంగా నడపడం, ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించక పోవడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Around 15 people dead, 35 were injured after bus collides with truck in Dhule in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X