వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

150 మందికి గుండ్లు.. వైద్య విద్యార్థులకు టార్చర్.. సీనియర్ల పైశాచికత్వం..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో : ర్యాగింగ్ రాక్షసత్వం మరోసారి పడగలు విప్పింది. సీనియర్ల అరాచకాలతో జూనియర్లు ర్యాగింగ్ భూతానికి నిలువుటద్దంలా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాభై మంది విద్యార్థులకు గుండు కొట్టించిన ఘటన హాట్ టాపికయింది.

యూపీలో మరోసారి ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ర్యాగింగ్ నిలువరించడానికి అమలు చేస్తున్న చట్టాలకు భయపడని కొందరు రెచ్చిపోతున్నారు. ఆ క్రమంలో సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. వర్సిటీలో కొత్తగా చేరిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో అత్యంత దారుణంగా బీహేవ్ చేశారు.

150 UP Medical Students Heads Shaved Seniors ragging

సైఫాయ్ మెడికల్ వర్సిటీలో జరిగిన దారుణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూనియర్లను ర్యాగింగ్ చేసిన సీనియర్లు.. గుండ్లు కొట్టించుకుని తమకు సెల్యూట్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. దాంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాభై మంది విద్యార్థులు గుండు కొట్టించుకుని సీనియర్లకు సెల్యూట్ చేశారు.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో రాములమ్మ.. అందుకేనా ఎంట్రీ ఇలా..!టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో రాములమ్మ.. అందుకేనా ఎంట్రీ ఇలా..!

సీనియర్ల ఆదేశాలు పాటించకుంటే తమను ఎక్కడ ఇబ్బందులకు గురిచేస్తారేమోనన్న భయంతో వారు చెప్పినట్లుగా 150 మంది స్టూడెంట్స్ గుండు కొట్టించుకున్నారు. అంతేకాదు వారు చెప్పినట్లుగా తెల్లటి వస్త్రాలు ధరించి కాలేజీకి వచ్చేటప్పుడు క్యూ లైన్‌లో రావాలన్న ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారు. ఆ క్రమంలో కొన్ని సన్నివేశాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాకు చేరడంతో వైరల్‌గా మారాయి.

150 UP Medical Students Heads Shaved Seniors ragging

సీనియర్ల పైశాచికత్వంపై దుమారం రేగడం.. యూనివర్సిటీ తీరుపై ఆరోపణలు రావడంతో డీన్ రాజ్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. వర్సిటీ పరిధిలో ర్యాగింగ్‌కు చోటు లేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై నిఘా ఉంచుతామని.. జరిగిన ఘటనపై కొందరు సీనియర్లను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

English summary
A group of 150 first year medical students were forced to shave their heads and salute their seniors, in an alleged case of ragging that took place at a university in Uttar Pradesh on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X