బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆంజనేయస్వామి భక్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యడానికి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేడు నేలమట్టం అయ్యింది. బీజేపీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలురేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలు

150 ఏళ్ల చరిత్ర

150 ఏళ్ల చరిత్ర

బెంగళూరు నగరంలోని ఆర్ వీ రోడ్డులోని బోమ్మసంద్ర మార్గంలోని గారేబావి పాళ్యలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది. ప్రతిరోజు ఈ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

మెట్రో రైలు పనులు

మెట్రో రైలు పనులు

గారేబావిపాళ్య, బోమ్మనహళ్ళి, రూపేనఅగ్రహార ప్రాంతాల్లో మూడు ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రతి నిత్యం పండుగలతో పాటు నిత్యం ఈ ఆలయాల్లో పూజలు జరుగుతుంటాయి. ఇదే ప్రాంతాల్లో నమ్మ మెట్రో రైలు అభివృద్ది పనులు జరుగుతున్నాయి.

నమ్మించి మోసం చేసిన బీజేపీ

నమ్మించి మోసం చేసిన బీజేపీ

నమ్మ మెట్రో పనులు చేసే సమయంలో ఆలయాల జోలికి వెళ్లమని, అన్ని ఆలయాలు అలాగే ఉంటాయని ఇంత కాలం అధికారులు చెబుతూ వచ్చారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గారేబావిపాళ్యలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఈ విషయంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు చెప్పింది ఏమిటి ? ఏం చేస్తున్నారు ? అని స్థానికులు ప్రశ్నించారు.

మెట్రో రైలు అవసరం ఉంది, అయితే ?

మెట్రో రైలు అవసరం ఉంది, అయితే ?

ట్రాఫిక్ రద్దీని అరికట్టడానికి ఈ ప్రాంతంలో మెట్రో రైలు అవసరం అని, అయితే ఆలయాలు నేలమట్టం చెయ్యకుండా వేరే విధంగా ఆలోచించి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోసారి ఈ ప్రాంతంలో వేరే ఆలయాల జోలికి వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని స్థానికులు హెచ్చరించారు.

English summary
The Anjaneya Temple at Garvepalya has been demolished for Namma metro work on the Bommasandra route from RV Road in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X