వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా బరిలో 156 మంది కోటీశ్వరులు: ఆ రెండు తప్ప...

శనివారం పోలింగ్ జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో దాదాపు మూడొంతుల మంది అభ్యర్థులు కోటీశ్వరులే. మొత్తం 251 మంది అభ్యర్థుల్లో 156 మంది కోటీశ్వర్లు కావడం గమనార్హం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

పనాజీ: శనివారం పోలింగ్ జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో దాదాపు మూడొంతుల మంది అభ్యర్థులు కోటీశ్వరులే. మొత్తం 251 మంది అభ్యర్థుల్లో 156 మంది కోటీశ్వర్లు కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సేకరించిన అఫిడవిట్ల ప్రకారం పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థుల్లో 97 శాతం మంది మల్టీ మిలీయనీర్లు కాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 92 శాతం మంది, అవినీతికి వ్యతిరేకంగా తొలిసారి బరిలో దిగిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో 52 శాతం మంది కోటీశ్వర్లు ఉన్నారు.

ఆమ్ఆద్మీ పార్టీ నేత రంజిత్ కొట్టా కార్వాల్హో తన ఆస్తులు రూ.65 కోట్ల పైనేనని ప్రకటించారు. తర్వాతీ స్థానంలో బీజేపీ నేత మిచైల్ విన్సెంట్ లోబో రూ.54 కోట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ సింగ్ ఆర్ రాణె రూ.50 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారు. అయితే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు మాత్రం కనీస స్థాయిలోనే ఉన్నారు. 251 మంది అభ్యర్థుల్లో 38 మంది (15 %) మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 19 మంది (ఎనిమిది శాతం) పై మాత్రం తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న 37 మందిలో తొమ్మిది మంది (24%), బీజేపీ నుంచి 17 శాతం, ఆప్ అభ్యర్థుల్లో 8% మందిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. అయితే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో 16 శాతం, బిజెపి అభ్యర్థుల్లో ఎనిమిది శాతం మంది తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.

బిజెపిదే తుది నిర్ణయం

బిజెపిదే తుది నిర్ణయం

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్).. మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలపై ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించింది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల బాద్యతను మాత్రం బీజేపీకే వదిలేసింది. అధికారికంగా మాత్రం ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యకలాపాలకు దూరమైనా ఆర్ఎస్ఎస్ జోక్యంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన అతిపెద్ద రెండు రాష్ట్రాల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్ ఇంజనీరింగ్‌పై కినుక...

సోషల్ ఇంజనీరింగ్‌పై కినుక...

అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి నాయకత్వం కులాల ప్రాతిపదికన అనుసరిస్తున్న సోషల్ ఇంజినీరింగ్‌పై ఆర్ఎస్ఎస్ అసంత్రుప్తిగా ఉన్నట్లు సమాచారం. కులాల వారీగా విభజన వల్ల విస్త్రుత స్థాయిలో హిందువుల ఐక్యతను దెబ్బ తీస్తాయని సంఘ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. హిందూత్వ ఎజెండాను ఎన్నికల ప్రచారాస్త్రంగా మలిచేందుకు సిద్ధం అయినా.. వ్యూహం మాత్రం కులాల ప్రాతిపదికన ఓటర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రత్యేకించి యూపీలో యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులను తమ అక్కున చేర్చుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచించడం ఆర్ఎస్ఎస్‌కు ఏమాత్రం రుచించడం లేదు. కులాల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపికకు కూడా ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదని తెలుస్తోంది.

అకాలీలపై అభ్యంతరాలు

అకాలీలపై అభ్యంతరాలు

ఇక పంజాబ్ లోనూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తుపైనా సంఘ్‌కు గట్టి అభ్యంతరాలే ఉన్నాయి. ఈ రెండు కారణాల రీత్యా యూపీ, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలకు ఆర్ఎస్ఎస్ దూరంగా ఉన్నదని వినికిడి. దీనికంటే ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలపై సంఘ్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తమ శ్రేణులు చేసేది చాలా తక్కువని, బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందున పెద్దగా చేయాల్సిందేమీ లేదని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఒకరు చెప్పారు. అయితే కోర్ ఎజెండాపైనే ద్రుష్టిని కేంద్రీకరించాలని బిజెపికి హితవు చెప్తోంది.

రాష్ట్రీయ సిక్ సంగట్...

రాష్ట్రీయ సిక్ సంగట్...

సిక్కులను తమ అక్కున చేర్చుకునేందుకు పంజాబ్‌లో ఆర్ఎస్ఎస్.. రాష్ట్రీయ సిక్ సంగట్ అనే సంస్థను ప్రారంభించింది. అయితే అకాలీలతో దూరమయ్యేందుకు సిద్ధంగానూ లేదు. వారినీ హిందూ వాదంలోకి తీసుకొచ్చేందుకే ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఇక పంజాబ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై సంఘ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. క్రిష్టియన్ మైనారిటీ సంస్థల ప్రాతినిధ్యం పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఖలీస్థాన్ ఉద్యమం ఊపందుకునే అవకాశమూ ఉన్నదని ఆందోళన ఉందని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక కేంద్రాలు

ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక కేంద్రాలు

ఇక ఉత్తరాఖండ్‌లో భారీ స్థాయిలో పుణ్య క్షేత్రాలు ఉండటంతో సదరు సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవడంతో క్రిస్టియన్ మైనారిటీలు అడుగు పెట్టకుండా చూడొచ్చని సంఘ్ వ్యూహం. చైనా సరిహద్దుల్లో ఉండటం వల్ల కూడా ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ చేయూతనివ్వడానికి కారణంగా తెలుస్తోంది.

వెలింగ్కర్ ఎఫెక్ట్....

వెలింగ్కర్ ఎఫెక్ట్....

కానీ గోవాలో పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. సంఘ్ ప్రభావిత ఓట్లన్నీ గుండుగుత్తగా బీజేపీకి పడే అవకాశాల్లేవు. సంఘ్ సీనియర్ నేత సుభాష్ వెలింగ్కర్ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకోవడంతోపాటు ఎన్డీయే భాగస్వామి శివసేన, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలతో పొత్తు పెట్టుకుని బిజెపికి సవాల్ విసురుతోంది. దీనికి తోడు తొలిసారిగా ఆప్ రంగ ప్రవేశం చేయడం సంఘ్ ను కలవరపెడుతున్నది. అంతే కాదు ఇంగ్లిష్ మాట్లాడే పోర్చుగీస్ ప్రాంత వాసులను బుజ్జగించేందుకు బిజెపి - ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని వెలింగ్కర్ ఎదురు దాడి కూడా చేస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పందిస్తూ తనకు నాగ్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ గురించి మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. పరోక్షంగా వెలింగ్కర్ పార్టీతో తమకు నష్టం లేదన్న సంకేతాలు ఇచ్చారు. కానీ వెలింగ్కర్ ను బయటకు పంపిన తర్వాత రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి కార్యకర్తలు సంస్థకు రాజీనామా చేసి బయటకు రావడం బిజెపికి భారీ నష్టమే వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.

మణిపూర్‌లో పాగాకు రాం మాధవ్ సారథ్యం

మణిపూర్‌లో పాగాకు రాం మాధవ్ సారథ్యం

అసోం, కేరళలలో మాదిరిగా మణిపూర్ రాష్ట్రంలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అసోంలో విజయం తర్వాత మణిపూర్ రాష్ట్రంలో ఇబోబీసింగ్ నాలుగో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, ఎన్నికల వ్యూహకర్త రజత్ సేథీ కలిసి మణిపూర్ రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లతో కలిసి వ్యూహాలు రూపొందిస్తున్నది.

English summary
As many as 156 of the 251 candidates for the February 4 Goa assembly election are crorepatis or multi-millionaires, reveals an analysis of the information furnished by candidates in their election affidavits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X