వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా కిరాతకానికి బలైపోయిన భారత జవాన్లకు శౌర్య పతకాలు -రిపబ్లిక్ డే పరేడ్‌లోనే..

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా మధ్య ఐదు దశాబ్దాల శాంతికి విఘాతం కలిగిస్తూ.. సరిహద్దులో నెత్తుటేరులు పారిన ఘటనగా గాల్వాన్ ఘర్షణ చరిత్రలోకెక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన గాల్వాన్ హింసకు సంబంధించి తాజాగా మరో కీలక అంశం వెల్లడైంది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయను కాపాడేందుకు చైనా సైనికులతో తలపడి అమరులైన భారత జవాన్లకు అరుదైన గౌరవం దక్కనుంది.

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

గాల్వాన్ లోయలో గతేడాది జూన్‌‌ 15న చైనాతో జరిగిన ఘర్షణల్లో 16వ బీహార్ రెజిమెంట్ కు చెందిన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తెలుగువారైన కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలో 16బీహార్ రెజిమెంట్ బృందం.. డ్రాగన్ బలగాలకు దీటుగా బదులిచ్చింది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థితో పోరాడిన జవాన్లకు రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను అందజేయనుంది.

‘16 Bihar’ heroes of Galwan clash to be honoured at Republic Day parade

కల్నల్ సంతోష్ బాబుతోపాటు కనీసం ఐదుగురికి శౌర్య పతకాలు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఎన్ని మెడల్స్, ఎంతమందికి అందిస్తారనే దానిపై డిఫెన్స్ మినిస్ట్రీ కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు. జనవరి 26న రాజ్ పథ్ వేదికగా జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమరుల కుటుంబాలకు సదరు పతకాలను కేంద్రం అందజేయనుంది..

కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?

గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లు నటించిన చైనా.. మళ్లీ కొద్దిరోజులకే తన విస్తరణవాద వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య మార్గాల్లో జరుగుతోన్న చర్చలు వరుసగా విఫలం అవుతుండంతో 10 నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

English summary
At least five Indian Army soldiers including Colonel B Santosh Babu of 16 Bihar battalion who blocked Chinese People Liberation Army (PLA) aggression to capture territory in East Ladakh’s Galwan Valley on June 15 last year will be posthumously honoured with gallantry medals on Republic Day, people familiar with the matter said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X