చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో 'క్యాట్ బిర్యాని' దందా : గుట్టురట్టు చేసిన పోలీసులు (వీడియో)

|
Google Oneindia TeluguNews

చెన్నై : చికెన్ బిర్యానీ.. మటన్ బిర్యానీ.. వెజ్ బిర్యానీ.. ఇలా బిర్యానికి సంబంధించి ఈ పేర్లన్ని వినే ఉంటాం. కానీ క్యాట్ బిర్యానీ గురించి ఎప్పుడైనా విన్నారా! 'క్యాట్ బిర్యాని' పేరు వినగానే డోకు వచ్చినంత పనైనా ఆశ్చర్యం లేదేమో! కానీ చెన్నైలో మాత్రం ఈ క్యాట్ బిర్యానికి మంచి డిమాండే ఉన్నట్టుంది.

తాజాగా ఓ స్వచ్చంద సంస్థతో కలిసి చెన్నై పోలీసులు చేసిన దాడుల్లో ఈ అక్రమ దందా బాగోతం వెలుగుచూసింది. ఎక్కడెక్కడినుంచో పిల్లుల్ని వెంటాడుకొచ్చి బిర్యానీ వండి వార్చేస్తున్నారు. విషయం కాస్త జంతు సంరక్షణ సంస్థకు తెలియడంతో.. చెన్నై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో మరో స్వచ్చంద సంస్థ సహకారంతో క్యాట్ బిర్యాని దందా గుట్టురట్టు చేశారు పోలీసులు.

వాహనంలో బంధించి ఉన్న పిల్లులకు విముక్తి కల్పించారు. అయితే సాధారణ పిల్లుల్లా కాకుండా.. ఈ పిల్లులు గోడల మీద బల్లిలా పాకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్పందించిన వాలంటీర్లు.. ఎక్కువ రోజులు బోనులో బంధించి బడి ఉండడం వల్ల పిల్లుల ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా తెలిపారు. అయితే ఇలాంటి దందాలు గతంలోను వెలుగుచూశాయని చెబుతున్నారు స్థానికులు. చెన్నైలో గతకొద్ది రోజులుగా పెంపుడు పిల్లులు మిస్సవడం పట్ల పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మిస్సింగ్ కారణం.. 'క్యాట్ బిర్యాని' దందానే అని గుర్తించారు పోలీసులు.

English summary
Police and volunteers of People for Animals (PfA) rescued 16 cats from a narikorava settlement in Pallavaram here on Friday. The cats were kept for their meat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X