వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితుడితో కాలేజ్ అమ్మాయి చిట్ చాట్, ప్రియుడికి మండిపోయింది, నమ్మించి రేప్ చేసి కిరాతకంగా!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తన ప్రియురాలు వేరే యువకుడితో చనువుగా ఉంటున్నదని అనుమానంతో ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడు దారుణంగా హత్య చేశాడు. నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పినట్లు ఉండాలి అంటూ గొడవ పెట్టుకుని మాటామాటా పెరగడంతో బాలికను చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసి చివరికి తల మీద బండరాయి వేసి హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!

ఇంటర్ అమ్మాయి

ఇంటర్ అమ్మాయి

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, మణికండం ఉత్తర నాగమంగళం ప్రాంతానికి చెందిన రాజగోపాల్ కుమార్తె కవిప్రియ (16) ప్లస్ టూ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదువుతోంది. డిసెంబర్ 31వ తేదీన ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లిన కవిప్రియ తరువాత తిరిగి రాలేదు. కవిప్రియ కోసం ఆమె కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

అడవిలో దారుణ హత్య

అడవిలో దారుణ హత్య

కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులు కవిప్రియ కోసం గాలిస్తూనే ఉన్నారు. అటవి ప్రాంతంలో కవిప్రియ కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో తల మీద బండరాయి వేసి హత్య చేసిన విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. మొదట గుర్తు తెలియని వ్యక్తులు అటవి ప్రాంతంలో కవిప్రియ మీద లైంగిక దాడి చేసి తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేశారు.

కవిప్రియకు ప్రియుడు

కవిప్రియకు ప్రియుడు

విచారణ చేస్తున్న పోలీసులకు ఇనాంమత్తూరు ప్రాంతానికి చెందిన మదికుమార్ (22) అనే యువకుడితో కవిప్రియకు పరిచయం ఉందని, ఇద్దరు కలిసి తిరిగేవారని తెలిసింది. మదికుమార్ తో కవిప్రియ ప్రేమలో ఉందని, కాలేజ్ కు వచ్చే సమయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకునే వారని ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మదికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాలేజ్ లో మరో యువకుడు

కాలేజ్ లో మరో యువకుడు

కాలేజ్ లో మరో యువకుడు కవిప్రియతో చనువుగా ఉండేవాడని మదికుమార్ కు తెలిసింది. ఈ విషయంలో కవిప్రియతో మదికుమార్ చాలాసార్లు గొడవలు పడేవాడని సమాచారం. తనకు ఆ యువకుడు స్నేహితుడు మాత్రమే అని, నువ్వు లేనిపోని అనుమానాలు పెంచుకోరాదని కవిప్రియ ప్రియుడు మదికుమార్ కు నచ్చచెప్పిందని తెలిసింది.

నేను మంచి వాడు కాదు !

నేను మంచి వాడు కాదు !

నీతో మాట్లాడాలని కవిప్రియకు మాయమాటలు చెప్పిన మదికుమార్ ఆమెను అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లాడు. తరువాత యువకుడితో పరిచయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని, నేను చెప్పినట్లు మాత్రమే వినాలని, లేదంటే నేను మంచి వాడు కాదని మదికుమార్ ప్రియురాలు కవిప్రియను హెచ్చరించాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది.

చెప్పినట్లు వింటావా ? నా చేతిలో చస్తావా

చెప్పినట్లు వింటావా ? నా చేతిలో చస్తావా

ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన మదికుమార్ ప్రియురాలు కవిప్రియ వేల్ తీసుకుని ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. తరువాత కవిప్రియ మీద బలవంతంగా లైంగిక దాడి చేసిన మదికుమార్ సమీపంలోని బండరాయి తీసుకుని ఆమె తల మీద వేసిదారుణంగా హత్య చేశాడు.

గ్యాంగ్ రేప్ జరిగిందా ?

గ్యాంగ్ రేప్ జరిగిందా ?

కవిప్రియు వేల్ తీసుకుని ఆమె ముఖాన్ని మూసిపెట్టి అక్కడి నుంచి మదికుమార్ పరారైనాడు. కవిప్రియను తానే హత్య చేశానని మదికుమార్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. అయితే కవిప్రియ హత్య తీరును పరిశీలిస్తే ఆమె గ్యాంగ్ రేప్ కు గురైయ్యిందా?, మదికుమార్ ముగ్గురు స్నేహితులకు ఈ కేసుతో సంబంధం ఉందా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తిరుచ్చి పోలీసులు తెలిపారు.

English summary
16 year old school student murdered near Trichy in Tamil Nadu and 21 year old young man arrested under pocso.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X