వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 మంది కరోనా పాజిటివ్ రోగులు అదృశ్యం, మారుతీ సుజుకీ సిబ్బంది, ఇదివరకు 67 మంది...

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీ గురించి అయితే చెప్పక్కర్లేదు. పక్కనే గల హర్యానాలో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గురుగ్రామ్‌లో 17 మంది మారుతీ సుజకీ సిబ్బంది కరోనా వైరస్ సోకింది. వారిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన యజమాన్యం, ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యం వహించారు. దీంతో వారి ఆచూకీ తెలియడం లేదు.

Coronavirus: మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్, వంట మనిషి దెబ్బ, సీఎం, మంత్రులు సేఫ్ !Coronavirus: మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్, వంట మనిషి దెబ్బ, సీఎం, మంత్రులు సేఫ్ !

 17 మంది మాయం..

17 మంది మాయం..

హర్యానా గురుగ్రామ్‌లో గల మనేసర్ వద్ద మారుతీ సుజుకీ ప్లాంట్ ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బందికి పరీక్షలు చేయగా 17 మందికి కరోనా పాజిటి వచ్చింది. వీరి స్వస్ధలం ఝాజ్జర్‌ అని అధికారులు పేర్కొన్నారు. సుజుకీ ప్లాంట్ సమీపంలో వారికి క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే మిగతావారు ఉన్నారు కానీ.. 17 మంది కనిపించలేదు. దీంతో ఆందోళన నెలకొంది.

 67 మంది

67 మంది

మారుతీ సిబ్బంది 17 మంది కనిపించడం లేదు అని స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వారు తప్పిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 మందే కాదు ఇదివరకు 67 మంది కూడా కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా మిస్సవడంతో.. వారు ఎక్కడికీ వెళ్లారు. బహిరంగ ప్రదేశంలోకి వెళితే ఎలా..? వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనే ఆందోళన నెలకొంది.

Recommended Video

Cycling Federation Offered Trial To Girl Who Cycled 1200 km Carrying Father
ఇద్దరు మృతి

ఇద్దరు మృతి

గురుగ్రామ్‌లో సోమవారం 85 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 4 వేల 512గా ఉంది. ప్రస్తుతం 1820 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకిన ఇద్దరు సోమవారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 66కి చేరింది.

English summary
17 coronavirus patients have gone missing in Haryana's Gurugram. coronavirus patients were all employees of the auto giant Maruti Suzuki and worked at the company's plant in Manesar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X