వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం

దేశ రాజధానిలోని బవానా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బవానా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్‌ పరిశ్రమ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మూడంతస్తుల పరిశ్రమలో చెలరేగిన ఈ మంటల్లో తొలి అంతస్తులో 13 మంది మృతి చెందగా, కింది అంతస్తులో మరో నలుగురు మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు.

bawana-fire-accident

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 నుంచి 20 అగ్నిమాపక యంత్రాలతో ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.

అయితే, ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు కార్మికులు టెర్రస్‌ పైనుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

మహిళలతో పాటు ఇంకా కొందరు కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు

English summary
At least 17 people are feared to be dead after a fire broke out in three separate places in Bawana industrial area, Delhi on Saturday. Plastic factory, cracker storage and furnace oil storage in sectors 1, 5 and 3 in the area were gutted in the flames. All the casualties are said to have been reported from the cracker storage factory, from where the blaze is believed to have started. No casualty was reported from the other two sectors. The police have so far confirmed nine deaths in the fire. "We received three calls from Bawana - Sector 1 a plastic factory, 2nd from Sector 5 a cracker storage and Sector 3 a furnace oil storage. All casualties are from Sector 5 fire. Fire is completely under control now. We have so far recovered 17 bodies," ANI quoted the Director of Delhi Fire Services GC Mishra saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X