వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు గత వైభవం వచ్చేనా..? సోషల్ మీడియాలో వైరల్‌గా 170ఏళ్ల క్రితం నాటి ప్లేట్ ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణకు ముగింపు పలకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశంపై హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. దశాబ్దాల క్రితం నాటి భారత స్వరూపాన్ని ప్రతిబింబించే ఫొటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు

ఆర్టికల్ 370పై శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం.. ఆయన ఏమి కోరుకున్నారు... బీజేపీ ఏమి చేసింది.. !! ఆర్టికల్ 370పై శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం.. ఆయన ఏమి కోరుకున్నారు... బీజేపీ ఏమి చేసింది.. !!

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం మన భారతదేశం. దేశ విభజనకు పూర్వం ఉన్న భారత భౌగోళిక స్వరూపానికి సంబంధించిన ఫొటోలను నెటింట్లో సందడి చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ఇవి సర్యులేట్ అవుతున్నారు. ఇలా షేర్ అవుతున్న పిక్‌లన్నింటిలో ఓ ప్లేట్ ఫొటో వైరల్‌గా మారింది. కరాచీలో తయారు చేసినదిగా భావిస్తున్న ఈ ప్లేట్ 170 ఏళ్ల నాటిదిగా తెలుస్తోంది. విభజనకు పూర్వంనాటి భారత దేశ స్వరూపం ఈ ప్లేట్‌లో కనిపిస్తోంది.

170 years old plate made in karachi is viral on social media

కరాచీలో తయారైన ఈ ప్లేట్‌లో పైన ఇండియా అని రాసి ఉంది. దాని కింద ఉన్న మ్యాప్‌లో ఢిల్లీ, లక్నో, బాంబే, మద్రాస్, కలకత్తా‌తో పాటు ప్రస్తుతం పాకిస్థాన్‌లో భాగమైన కరాచీ , లాహోర్‌లు కూడా భారత్‌లో అంతర్భాగంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మయన్మార్‌గా పిలుస్తున్న రంగూన్ ప్రాంతం కూడా భారత్‌లో భాగంగా ముద్రించారు. ఈ పటంలో భారత్ దిగువ భాగంలో ఒకవైపు ఇండియన్ మరోవైపు ఓషన్ అని రాసి ఉంది. దాదాపు 170ఏళ్ల నాటి ప్లేట్‌లో ఉన్నట్లుగానే భారత్ దేశం మళ్లీ కనిపించాలని ఆ వైభవాన్ని తిరిగి పొందాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

English summary
170 years old plate made in karachi is viral on social media. in which karachi and lahore are seem to be part of india. rangoon which is now known as myanmar is also showed as part of undivided india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X