వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:54మంది వైద్య సిబ్బంది క్వారంటైన్, 18 మంది వైద్యులు, ఇటీవల చిన్నారికి సర్జరీ...

|
Google Oneindia TeluguNews

ఎవరి నుంచి, ఏ వైపు నుంచి వస్తుందో తెలియడం లేదు గానీ.. కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల ఓ చిన్నారికి వైద్య చికిత్స చేసిన 54 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ చిన్నారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. వైద్యులు, సిబ్బంది నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

6 నెలల చిన్నారికి...

6 నెలల చిన్నారికి...

పంజాబ్‌లోని ఫాగ్వారాకు చెందిన 6 నెలల చిన్నారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితోపాటు ఇతర సమస్యలు ఉన్నాయి. ఆమెను లుధియానాలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షించారు. తర్వాత శస్త్ర చికిత్స కోసం చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిడియాట్రిక్ సెంటర్‌కు తరలించారు. ఈ నెల 9వ తేదీన చిన్నారికి వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. చిన్నారి కూడా క్రమంగా కోలుకుంటున్నది. కానీ ఆమెకు కరోనా వైరస్ సోకిందనే విషయం వైద్యులను జీర్ణించుకోలేకపోయారు.

సర్జరీ ఓకే.. కానీ...

సర్జరీ ఓకే.. కానీ...

సర్జరీ చేశాక కూడా బాగానే ఉంది.. కానీ వెంటిలేటర్‌పై ఉంచాల్సి రావడంతో ఈ నెల 21వ తేదీన చిన్నారిని అదే ఆస్పత్రి సముదాయంలో గల నెహ్రూ ఆస్పత్రి ఎక్స్‌టెన్షన్‌కు తరలించారు. తర్వాత చిన్నారికి కరోనా వైరస్ సోకిందని తెలిసి వైద్య సిబ్బంది ఆందోళన చెందారు. చిన్నారికి ఎవరి నుంచి వైరస్ వచ్చిందనే అంశంపై ఆరాతీస్తున్నారు. సాధారణంగా వైరస్ 2 వారాలపాటు ఉంటుందని.. వెంటిలేటర్‌పై 14 రోజులు ఉంచడంతో వైరస్ తగ్గుతోందని భావిస్తున్నారు. అయితే చిన్నారి విదేశాలకు వెళ్లలేదని.. అతని ఫ్యామిలీ కూడా ఇతర దేశాలకు వెళ్లలేదని ప్రాథమిక విచారణలో తేలింది.

54 మంది వైద్య సిబ్బంది

54 మంది వైద్య సిబ్బంది

చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేందుకు 54 మంది సిబ్బంది పనిచేశారు. అందులో 18 మంది వైద్యులు ఉండగా.. మిగతా వారు సిబ్బంది ఉన్నారు. పాపకు వైరస్ సోకిందని తెలియడంతో.. వెంటనే వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి... పరీక్షలు చేయించుకుంటారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Recommended Video

COVID-19 : Cabinet Approves Ordinance To Protect Health Workers

English summary
Fifty four staffers of the Postgraduate Institute of Medical Education and Research in Chandigarh, including 18 doctors, have been quarantined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X