వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది మృతి, ప్రధాని మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లా అంబాజీ వద్ద బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 21 మంది మృతిచెందారు. మృతుల్లో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 32 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. బనస్కాంత జిల్లాలో ఆ ప్రభావం ఎక్కువగానే ఉన్నాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

18 killed as bus falls into gorge, pm modi condolence

రోడ్డు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై స్థానిక అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఆదివారం ఓ ఎస్‌యూవీ వాహనం ట్రక్కును ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వడోదర ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న ఉదయం 7.30 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

English summary
eighteen people were killed after a bus carrying 40 passengers fell into a gorge near Ambaji in Banaskantha district of Gujarat, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X