వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గుర్గావ్‌ దారిలో ట్రాఫిక్ జాం, 18 మెట్రో స్టేషన్లు క్లోజ్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి సవరణలు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. గురువారం ఉదయం నుంచే వివిధ చోట్ల ఆందోళనలు జరిగాయి. ఢిల్లీ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకున్న ఫలితం లేకపోయింది. ఎర్రకోట, మండీ హౌస్, మిగతా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి.

 పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్ పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్

నో పర్మిషన్

నో పర్మిషన్

మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వెళ్లి ఆందోళన చేసేందుకు కమ్యునిస్టులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మథుర రోడ్-కలిండీ కంజ్ రహదారులను మూసివేస్తున్నట్టు పోలీసులు ముందుగానే ప్రకటించారు. వాహనదారులు ఢిల్లీ రావాలంటే నోయిడా నుంచి డీఎండీ ఫ్లై ఓవర్ మీదుగా అక్షర్ ధామ్ రహదారి మీదుగా రావాలని సూచించారు. ఆందోళనల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లను మూసివేశారు.

మెట్రో స్టేషన్లు ఇవే..

మెట్రో స్టేషన్లు ఇవే..

జామియా మిల్లియా, జామా మసీదు, మున్రికా, వసంత్ విహార్, మండీ హౌస్, పటేల్ చౌక్, లోక్ కల్యాణ్ మార్గ్, ఉద్యోగ్ భవన్, ఐటీవో, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, జలోసా విహార్ సహీన్ బాగ్, లాల్ క్విల్లా, విశ్వ విద్యాలయ, సెంట్రల్ సెక్రటేరియట్, జన్ పథ్, రాజీవ్ చౌక్, బరకాంబా, చాందినీ చౌక్ మెట్రో స్టేషన్లను మూసివేశారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న సిబ్బంది

ట్రాఫిక్‌లో చిక్కుకున్న సిబ్బంది

ఢిల్లీలో ఆంక్షలు నెలకొన్నందున ప్రయాణికులు తమ సమయం కన్నా ముందుగానే చేరుకోవాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు స్పష్టంచేశాయి. కొన్ని సందర్భాల్లో విమానయాన సిబ్బంది కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని విస్తారా కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. గుర్గావ్ నుంచి వస్తోన్న తమ సిబ్బంది కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నారని తెలిపారు. మరోవైపు చరిత్రకారుడు రామచంద్ర గుహ 30 మంది ఆందోళనకారులతో కలిసి బెంగళూరులో ఆందోళన చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Several parts of the National Capital witnessed massive jams on Thursday morning as the Delhi police barricaded roads and imposed restrictions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X