వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటరు జాబితాలో 18 లక్షల ముస్లీం ఓటర్ల పేర్లు మాయం: ఇది ఎవరి మాయ, ఆందోళన!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 2018 మే 12వ తేదీ శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 18 లక్షల మంది ముస్లీం ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో మాయం అయ్యాయని ఢిల్లీకి చెందిన ఎన్ జీవో సంఘం ఆరోపణలు చేసింది. కావాలనే ఓటరు జాబితా నుంచి ముస్లీం ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపణలు చేశారు. ఎన్ జీవో సంఘం ఆరోపణలను భారత ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఎవరి మాయ అని ముస్లీం సోదరులు చర్చించుకుంటున్నారు.

ఓటరు ఐడీలు

ఓటరు ఐడీలు

ఒకే రకం అయిన పేర్లు ఉన్న వారిని ఓటరు జాబితా నుంచి వారి పేర్లు తొలగించారని, కనీసం వారి దగ్గర ఓటరు గుర్తింపు కార్డులు లేవని సెంటర్ ఫర్ రీసర్చ్ యాండ్ డిబేట్స్ ఇన్ డెవలప్ మెంట్ పాలసీ అనే ఎన్ జీవో సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త

కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో ఓటరు జాబితా నుంచి దాదాపు 18 లక్షల మంది ముస్లీం ఓటర్ల పేర్లు తొలగించారని గుర్తించిన ఎన్ జీవో సంస్థ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ అబుసలేహ్ షరీఫ్ నేతృత్వంలో ఆందోళన చెయ్యడానికి సిద్దం అయ్యింది.

16 నియోజక వర్గాలు

16 నియోజక వర్గాలు

ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వూ ఇచ్చిన ఎన్ జీవో సంస్థ పరిశీలకుడు ఖాలిద్ సైఫుల్లా కర్ణాటకలోని 16 శాసన సభ నియోజక వర్గాల్లో 1.28 లక్షల మంది ముస్లీం ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని గుర్తించామని అన్నారు. ఈలెక్కన 224 నియోజక వర్గాల్లో 18 లక్షల మంది ముస్లీం ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయం అయ్యి ఉంటాయని అంచనా వేశామని ఖలిద్ సైఫుల్లా చెప్పారు.

బెంగళూరు శివాజీ నగర్

బెంగళూరు శివాజీ నగర్

2011 జనాబా లెక్కల ప్రకారం బెంగళూరులోని శివాజీనగర్ లో 18,453 ముస్లీం కుటుంభాలు ఉన్నాయి. అందులో 4.3 శాతం ఒక్కరే నివాసం ఉంటుటన్నారని చెప్పారు. 18,453 కుటంబాల్లో 8,900 కుటుంబాల్లోని వారికి ఒక్కరికే ఓటు హక్కు ఉందని, ఈ లెక్క ప్రకారం అక్కడ నివాసం ఉంటున్న వారిలో 40 శాతం మందికే ఓటు హక్కు ఉందని అంటున్నారు.

ఆందోళనకు సిద్దం

ఆందోళనకు సిద్దం

ఓటరు జాబితాలో మాయం అయిన ముస్లీంలను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించడానికి ఈ ఎన్ జీవో సంస్థ ఆందోనళ కార్యక్రమం చేపట్టింది. missingmuslimvoters.com అనే వెబ్ సైట్, Muslim Voters అనే అడ్రాయిడ్ యాప్ ను ప్రారంభించి ఓటరు జాబితా నుంచి పేర్లు మాయం అయిన ముస్లీం సోదరుల పేర్లు గుర్తించడానికి ప్రయత్నిస్తోంది.

English summary
An NGO has claimed that just before the crucial Karnataka assembly elections 2018, the names of 18 Muslims has gone missing from the voters’ list. The New Delhi based NGO, Centre for Research and Debates in Development Policy says that either the names are missing from the recently updated list of they do not have voter ID cards issued in their names.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X