వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Leap Day-2020: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద 182 మంది యోగాభ్యాసకుల 108 సూర్య నమస్కరాలు..

|
Google Oneindia TeluguNews

ప్రతీ నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరం వస్తోంది. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ జమవుతోంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నెలలో లీపు సంవత్సరం వచ్చింది. లీప్ ఇయర్ రోజు కొత్తగా చేయాలనుకొంటారు కొందరు. అలాగే గుజరాత్‌లో కొందరు యోగాభ్యాసకుల ఆసనాలు వేశారు. లీపు సంవత్సరం సందర్భంగా సూర్య నమస్కారాలు చేశారు.

గుజరాత్‌లోని కేవాడియా వద్ద గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద 182 మంది యోగాభ్యాసకుల 108 సూర్య నమస్కరాలు చేశారు. వడోదర యోగ్నికేతన్ సంస్థకు చెందిన వారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రదర్శన చేపట్టారు. లీపు సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా సూర్య నమస్కరాలు చేశామని పేర్కొన్నారు.

182 yoga practitioners perform Surya Namaskar at Statue of Unity..

182 మంది ఒకేసారి యోగసనాలు చేయడం అబ్బురపరిచింది. 12 భంగిమల్లో వారు సూర్యుడికి నమస్కారం కూడా చేశారు. సూర్య నమస్కారం చేయడంతో శరీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. 0.2422 రోజును 0.25గా పరిగణించడంతో సంవత్సరానికి ఆరు గంటలు మిగులుతోంది. అలా నాలుగు సంవత్సరాలకు ఒకరోజు అవుతోంది. మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్‌లో కలుపుతారు. దానిని లీపు సంవత్సరం అని పిలుస్తారు. సాధారణంగా ఫిబ్రవరిలో 28 రోజులు ఉండగా.. లీపు ఇయర్ రోజున 29 రోజులు ఉంటాయి.

English summary
182 yoga practitioners perform 'Surya Namaskar' at Statue of Unity to mark Leap year Day-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X