వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం.. 18సెం.మీల అతని తోకను కత్తిరించేశారు

|
Google Oneindia TeluguNews

నాగ్ పూర్ : జన్యుపరమైన లోపాలతో వింత శిశువులు జన్మించడం లాంటి ఘటనలను ఈమధ్య తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ 18ఏళ్ల కుర్రాడికి 18 సెం.మీల మేర తోక పెరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శస్త్ర చికిత్స ద్వారా నాగ్ పూర్ వైద్యులు ఆ తోకను తొలగించడంతో విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఓ 18ఏళ్ల కుర్రాడు పుట్టుకతోనే తోకతో జన్మించాడు. అతడి ఎదుగదలతో పాటు కుర్రాడి తోక కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ కుర్రాడికి 18ఏళ్లు ఉండగా.. తోక పొడవు కూడా 18సెం.మీ ఉంది. కాగా, తోక పెరుగుతుండడంతో కుర్రాడికి వెన్నెముక నొప్పి తీవ్రతరం కావడం ప్రారంభించింది.

18cm-long human tail removed surgically from 18 year old boy

ఈ నేపథ్యంలోనే కుర్రాడి తల్లిదండ్రులు అతడిని నాగ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొన్ని వైద్య పరీక్షల అనంతరం మొత్తానికి ఆ తోకను విజయవంతంగా తొలగించగలిగారు అక్కడి వైద్యులు . నిజానికి ఇలాంటి ఆపరేషన్లతో రోగికి కాలు, చేతులు పడిపోవడం, మూత్ర సంబంధిత వ్యాధులు రావడం వంటి ప్రమాదం కూడా ఒక్కోసారి సంభవించవచ్చునని వైద్యులు వెల్లడించారు.

పుట్టుకతోనే తమ కుమారుడికి తోక వచ్చిందని అయితే నిర్లక్ష్యంతో విషయాన్ని అంతగా పట్టించుకోలేదని, ఈమధ్య కాలంలో వెన్ను నొప్పి తీవ్రం కావడంతో వైద్యులను సంప్రదించామని ఆ కుర్రాడి తల్లిదండ్రులు చెప్పారు.

English summary
In a rare case, neurosurgeons at the Super Specialty Hospital (SSH) operated upon an 18-year-old city boy with an 18cm tail growing from the posterior end of the body on the back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X