వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది భారతీయుల విడుదల.. నైజీరియాలోని మన రాయబారి చొరవతో..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా తీరం సమీపంలో నెలరోజుల కిందట కిడ్నాప్ కు గురైన 19 మంది భాయతీయులను సముద్రపు దొంగలు ఎట్టకేలకు విడిచిపెట్టారు. డిసెంబర్ 15వ తేదీన ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. అనుకోని రీతిలో ఓ బాధితుడు చనిపోగా, మిగిలిన 19 మందిని ఆదివారం విడుదల చేశారు.

కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే నైజీరియా ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు చేసింది. నెలరోజుల నాటకీయ పరిణామాల తర్వాత ఖైదీల విడుదలకు పైరేట్లు అంగీకరించారు. నైజీరియా(అబూజా)లోని భారత హైకమిషనర్ అభయ్ ఠాకూర్ చొరవతో పెద్ద గండం తప్పినట్లయింది.

19 Indians abducted by pirates near Nigeria cost released, 1 dead

ఖైదీల విడుదలలో నైజీరియా ప్రభుత్వం కూడా భారత్ కు సహకరించిందని, కిడ్నాపైన 20 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 19 మంది శనివారం రాత్రి విడుదలయ్యారని, ఒకటి రెండు రోజుల్లో వారిని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాయబారి ఠాకూర్ ట్విటర్ లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నైజీరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఆఫ్రికా పశ్చిమ తీరంలో భారతీయులు కిడ్నాప్ కు గురైన ఘటనలు గతేడాది చివర్లో రెండు జరిగాయి. మొదటిది.. హాంకాంగ్‌ జెండాతో ఉన్న ఓడలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయుల్ని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేసి, కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఆ ఘటన జరిగిన 10 రోజులకే ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని దొంగలు అపహరించారు.

English summary
Nineteen Indians, kidnapped by pirates from a commercial vessel from the high seas off the western coast of Africa last month, have been released while one died in their captivity, according to the Indian mission in Abuja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X