వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామాంధుడికి బుద్ధి చెప్పిన 19 ఏళ్ల అమ్మాయి, అవార్డు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తనను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించిన ఒక కామాంధుడితో ధైర్యంగా పోరాడిన 19 ఏళ్ల ఒక అమ్మాయికి సోమవారం ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పురస్కారాన్ని అందజేశారు. ఆ అమ్మాయికి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో 'కమెండేషన్ రోల్'తో పాటు రూ. 10 వేల నగదు బహుమతిని అందించి సత్కరించి, ఈ అమ్మాయి తన సాహసంతో మిగతా అమ్మాయిలకు ఆదర్శంగా నలిచిందన్నారు.

19-year-old girl awarded for her bravery

తైక్వాండో, వుషు క్రీడల్లో జాతీయస్ధాయి పోటీల్లో పాల్గొన్న ఈ అమ్మాయి ప్రస్తుతం డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. వుషు శిక్షణకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా శుక్రవారం సాయంత్రం 6.30 నిమిషాలకు ఆమెను రాజేశ్ గుప్తా (28) అనే యువకుడు అడ్డుకున్నాడు.

ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యుల చేయడంతో పాటు... లైంగికంగా వేధించేందుకు యత్నించాడు. ఆ అమ్మాయి ధైర్యంగా స్పందించి అతడితో పోరాడింది. మార్షల్ ఆర్ట్స్‌లో తనకున్న నైపుణ్యంతో అతడికి బుద్ధి చెప్పంది. ఆ తర్వాత తను తన ట్రైనర్ అమిత్ గోస్వామి సహాయంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (నార్త్) మధుర్ వర్మకి అప్పగించారు. బురారీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

English summary

 The 19-year-old girl, a national player in Taekwondo and Wushu who had bravely fought off a man trying to molest her and then handed him over to the police was today awarded by the Delhi Police Commissioner B S Bassi for her bravery and courage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X