వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తమోడుతున్న రాజధాని, వరుస హత్యలతో జనం బెంబేలు ... హస్తినలో టీనేజర్ మర్డర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో క్రైం రేటు ఆందోళన కలిగిస్తోంది. గత గురువారం నుంచి వివిధ ప్రాంతాల్లో ఆరుగురు చనిపోవడం భద్రతను ప్రశ్నిస్తోంది. రాజధాని నగరంలో హత్యల పరంపరతో నగరం ఉలిక్కిపడింది. తాజాగా 19 ఏళ్ల టీనేజీ యువకుడు కూడా చనిపోవడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురువుతున్నారు. హస్తినలో ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

యువకుడి హత్య ..
గాంధీనగర్‌లోని తన ఇంట్లో యువకుడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతడిని అసబ్‌గా పోలీసులు గుర్తించారు. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తారని స్థానికులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేసే తోటి ఉద్యోగులు అసబ్ రూంలో అచేతనంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసబ్ కడుపులో గాయాలైనట్టు పోలీసులు గుర్తించారు. కత్తెరతో దుండగులు దాడిచేశారని డీసీపీ మేఘనా యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

19-year-old murdered in Gandhi Nagar, cops suspect use of scissor

ఆరు హత్యలు ...
అయితే గురువారం నుంచి ఢిల్లీలో ఆరు హత్యలు జరుగడం ఆందోళన కలిగిస్తోంది. భాల్‌స్వా డైరీ వద్ద ప్రాపర్టీ డీలర్, ఒక బాలుడిని హతమార్చారు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురరి ప్రాంతంలో 35 ఏళ్ల ఇద్దరు వ్యక్తులను దుండగలు కాల్చిచంపారు. దీంతో రాజధాని నగరవాసులు ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని గజగజ వణుకుతున్నారు. ఈ హత్య కేసులపై వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు.

English summary
A teenager was allegedly found murdered at his residence in Gandhi Nagar area of the national capital, the police said on Saturday. "The deceased identified as 19-year-old Asab used to work at a nearby factory. His dead body was discovered by his roommates when they returned from work," said Deputy Commissioner of Police (DCP) Shahdra, Meghna Yadav. "The injury is a stab in the abdomen, prima facie with a scissor," the senior police official said A case has been registered under section 302 (murder) of the Indian Penal Code (IPC) and other relevant sections of the law. So far, six people have been killed in five different incidents here since Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X