• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూ ఇయర్ పార్టీ.. మరో యువతితో బాయ్‌ఫ్రెండ్ రాసలీలు.. నిలదీసినందుకు ఎంత ఘోరం చేశారంటే...

|

ముంబైలో దారుణం జరిగింది. ఇటీవల కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన ఓ యువతి హత్యకు గురైంది. ఆమె బాయ్‌ఫ్రెండ్,మరో యువతి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. పార్టీకి వచ్చిన ఓ యువతితో తన బాయ్‌ఫ్రెండ్ రాసలీలలు సాగించడాన్ని ఆమె కళ్లారా చూసింది.దీనిపై అతన్ని నిలదీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆమె బాయ్‌ఫ్రెండ్ తాను రాసలీలలు సాగిస్తున్న యువతితో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. దాదాపు గంటన్నర పాటు ఆమె తల నుంచి రక్తం కారుతూనే ఉందని.. రక్తపు మడుగులో పడిపోయిన ఆ యువతిని పార్టీకి వచ్చినవాళ్లెవరూ గమనించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ముంబైకి చెందిన జాన్వీ కుక్రేజా(19) స్థానిక జైహింద్ కాలేజీలో సైకాలజీ విద్యను అభ్యసిస్తోంది. జనవరి 31వ తేదీ ఇంట్లోనే తండ్రి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు రాత్రి 12.15గంటల వరకు ఇంట్లోనే ఉన్న జాన్వీ.. ఆ తర్వాత తన స్నేహితురాలైన పొరుగింటి అమ్మాయితో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. పార్టీకి ఆమె బాయ్‌ఫ్రెండ్ శ్రీ కూడా వచ్చాడు. అయితే పార్టీలో అతను ఇతర అమ్మాయిలతో క్లోజ్‌గా ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.

దియాతో రాసలీలలు...

దియాతో రాసలీలలు...

దియా అనే యువతితో తన బాయ్‌ఫ్రెండ్ శ్రీ రాసలీలలు సాగించడాన్ని కళ్లారా చూసింది. దీనిపై శ్రీని ఆమె నిలదీయగా అతను తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. జాన్వీని సెకండ్ ఫ్లోర్‌కి తీసుకెళ్లి అక్కడ దియాతో కలిసి ఆమెపై దాడి చేశాడు. ఆమె తలను మెట్లకు,గోడకేసి చితకబాదాడు. దీంతో జాన్వీ తలకు తీవ్ర గాయమై అక్కడే కుప్పకూలింది. దాదాపు గంటన్నర పాటు ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.

ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేది...

ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేది...

పార్టీకి వచ్చినవాళ్లెవరూ జాన్వీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శ్రీ,దియా తమ దుస్తులకు రక్తపు మరకలతో అక్కడి నుంచి వెళ్లిపోవడం అందులో రికార్డయింది. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జాన్వీని ఆ సమయంలో ఎవరైనా చూసి ఆస్పత్రికి తరలించి ఉంటే ఆమె ప్రాణాలతో బయటపడేదని పోలీసులు అన్నారు. ఈ ఘటనపై జాన్వీ తల్లిదండ్రులు స్పందిస్తూ తెల్లవారుజామున 5గంటల సమయంలో తమకు ఈ సమాచారం అందిందన్నారు. అప్పటికే జాన్వీ మృతి చెందిందని చెప్పారు.

మర్మాంగాలపై గాయాలు

మర్మాంగాలపై గాయాలు

పోస్టుమార్టమ్ రిపోర్టులో బాధితురాలి తలపై బలమైన గాయాలతో పాటు ఆమె మర్మాంగాలపై కూడా గాయాలు ఉన్నట్లు నిర్దారణ అయిందని పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పారు. ఆ బిల్డింగ్‌ టెర్రస్‌పై పార్టీ జరిగిందని.. రెండో ఫ్లోర్‌లో జాన్వీ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తి నానమ్మ,తాతయ్య రెండో ఫ్లోర్‌లో ఉంటున్నారని... బహుశా గొడవ జరిగినప్పుడు నిద్రలో ఉండటం వల్ల వారు జాన్వీ అరుపులు విని ఉండకపోవచ్చునని చెప్పారు. అయితే పార్టీకి హాజరైన జాన్వీ స్నేహితులెవరూ ఆమెను పట్టించుకోకపోవడంపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

English summary
Investigations in the New Year party shocker in Mumbai have revealed that "if anyone had taken the 19-year-old victim to a hospital on time, she would have been alive today".Sources in the police department, investigating the case, have revealed that blood was profusely coming out from the 19-year-old woman's head, after her head was banged on the railing of the staircase by her "friends" Shree Jogdhankar and Diya Padankar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X